Breaking News
రాస్తారోకో చేస్తున్న కార్మికులు

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కార్మికుల రాస్తారోకో

కామారెడ్డి, ఏప్రిల్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు శనివారం కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా మెడికల్‌ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ యూనియన్‌ వర్కర్స్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్‌ మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు రాక మూడునెలలు గడుస్తుందని, అయినా అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేకపోవడం గర్హనీయమన్నారు. కార్మికులకు పనిభారం పెరుగుతుందని, వంద పడకలు పెరిగినా వేతనాలు పెంచకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని పేర్కొన్నారు.

గత కొన్ని రోజులుగా కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. మూడునెలల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బాల్‌రాజ్‌, రఫీక్‌, స్వరూప, రాము, సందీప్‌, భిక్షపతి, గంగాధర్‌, వీరేందర్‌, లక్ష్మి, బైరమ్మ, మమత, సిద్దిరాములు, కార్మికులు పాల్గొన్నారు.

Check Also

ఏఐఎస్‌ఎఫ్‌ రాస్తారోకో

కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐఎస్‌ఎఫ్‌ అద్వర్యంలో ఎలారెడ్డి మండల కేంద్రంలో ప్రేవేట్‌ యూనివర్సిటీలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *