Breaking News
కుస్తీలో తలపడుతున్న మల్లయోధులు

అలరించిన కుస్తీపోటీలు

రెంజల్‌, ఏప్రిల్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలోని కందకుర్తి గ్రామంలో శనివారం శ్రీరామ నవమిని పురస్కరించుకొని కుస్తీపోటీలు నిర్వహించారు. తరతరాలుగా ఆనవాయితీగా పోటీలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. కుస్తీపోటీల్లో పాల్గొనేందుకు మహారాష్ట్ర, తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మల్లయోధులు వచ్చారు. గ్రామసర్పంచ్‌ కలిమ్‌ బేగ్‌, మండల పోలీసుల బందోబస్తు నడుమ కుస్తీపోటీలు ప్రశాంతంగా ముగిశాయి. కుస్తీపోటీలకు మహారాష్ట్రలోని యావత్‌ మాల్‌ జిల్లా పూసత్‌ గ్రామానికి చెందిన యువతి మహిమ రాథోడ్‌, కోప్పర్గ గ్రామానికి చెందిన శ్రీనుతో తలపడగా మహిమ వెనుదిరిగింది.

ప్రేక్షకులు యువతికి తమకు తోచినంత నగదును అందించారు. మరికొందరు ఆమెతో సెల్ఫీలు దిగారు. ఆఖరుకుస్తీ 1200 గ్రాముల వెండి కడియం కుస్తీ నాందేడ్‌కు చెందిన దశరత్‌ లాతూర్‌కు చెందిన బాబు ఇద్దరు తలపడగా దశరత్‌ గెలిపొందాడు. గెలుపొందినవారికి బోధన్‌ రూరల్‌ సిఐ షకీర్‌ చేతుల మీదుగా బహుకరించారు. కార్యక్రమంలో రెంజల్‌ ఎస్సై శంకర్‌, బోధన్‌ ఎస్సైలు అంబారియా, యాకుబ్‌, ఏడపల్లి ఎస్సై రామునాయుడు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలుగు ఫోరం ఏర్పాటు

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిగ్రీ కాలేజ్‌లో 5 జిల్లాల తెలుగు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *