Breaking News
సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్‌

నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. శనివారం జనహితలో మిషన్‌ భగీరథ శాఖ, మునిసిపల్‌ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కంట్రోల్‌సెల్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు 84682 20072 నెంబరు నీటి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని తెలిపారు.

కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మునిసిపాలిటిల్లో నీటి సమస్య తెలుసుకొని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అన్నారు. ఏప్రిల్‌ 25 లోగా భగీరథ పనులను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. పాత పైప్‌లైన్‌లను యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *