నిజామాబాద్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరామ నవమి సందర్భంగా డిచ్పల్లి రామాలయంలో జరిగిన సీతారామ కళ్యాణ మహోత్సవాల్లో జిల్లా కలెక్టర్ రామ్మోహన్‌రావ్ సతీ సమేతంగా హాజరై పూజలు చేశారు. కలెక్టర్ రాక సందర్భంగా దేవస్థాన ఆలయ కమిటీ, పూజారులు కలెక్టర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ గుడిలోకి తీసుకెళ్ళి అర్చన చేశారు. అనంతరం ఆలయ అవరణలో జరిగిన సీతా రామ కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సతీమణి శ్రీ సీతారామచంద్రస్వామి వారికి హారతులిచ్చారు.
Read More »Daily Archives: April 14, 2019
స్ట్రాంగ్‌రూంలను పరిశీలించిన జిల్లా పాలనాధికారి
నిజామాబాద్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లోకసభ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను డిచ్పల్లిలోని సిఎస్సిఎంసిలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూం లకు సీల్ వేసినందున జిల్లా కలెక్టర్ ఆదివారం మధ్యాహ్నం పరిశీలించారు. సీఎంసీలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బోధన్, ఆర్మూర్, బాల్కొండ నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూముల సీల్‌ను పరిశీలించారు.
Read More »ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
కామారెడ్డి, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శని, ఆదివారాలు రెండు రోజుల పాటు వేడుకలు జరిపారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని వేడుకలు తిలకించారు. శ్రీరామ నామ జపాన్ని పారాయణం చేశారు.
Read More »శ్రీరామనవమి సందర్భంగా అన్నదానం
కామారెడ్డి, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ఆదివారం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ కైలాస్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. పండగను పురస్కరించుకొని భక్తులకు అన్నదానం చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
Read More »అంబేడ్కర్ బాటలో యువత నడవాలి
కామారెడ్డి, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సమాజమే దేవాలయంగా భావించారని, ఆయన చూపిన బాటలో యువత నడిచి అన్ని రంగాల్లో రాణించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను మునిసిపల్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. అణగారిన వర్గాలను అభివృద్ది మార్గంలో నడిపించి వారికోసం హక్కులు కల్పించి అందరికి అంబేడ్కర్ ఆదర్శప్రాయుడయ్యారన్నారు. శరీరం, మనసు, ఆత్మ అనుసందానం ద్వారా ...
Read More »అంబేడ్కర్ విగ్రహానికి వినతి
కామారెడ్డి, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని కార్మికులు ఆదివారం అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ వర్కర్స్ ఆధ్వర్యంలో కార్మికులు ఆసుపత్రి నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి రోడ్డుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని ...
Read More »ఘనంగా శ్రీరాముని శోభాయాత్ర
రెంజల్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంతో పాటు, వీరన్నగుట్ట గ్రామాల్లో శ్రీరాముని శోభాయాత్ర ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాంమందిరం నుండి శోభాయాత్ర మొదలుకొని గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా సాగింది. డి జె శబ్దాల మధ్య యువత కేరింతలు కొడుతూ నత్యాలు చేస్తూ జై శ్రీరామ్ నామ స్మరణతో శోభాయాత్ర నిర్వహించారు. వాడవాడలా స్వాములకు భక్తులు గంగజలాలతో స్వాగతం పలికారు. గ్రామాల్లో రాముని శోభాయాత్రను తిలకించేందుకు గ్రామస్థులు, పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read More »ఘనంగా విశ్వమేధావి జయంతి వేడుకలు
రెంజల్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచమేధావి, విశ్వరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 128వ జయంతి వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి జడ్పీటీసీ నాగభూషన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొర్గం, వీరన్నగుట్ట గ్రామాల్లో ఎంపిపి మోబిన్ ఖాన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ఎంపీపీ మోబిన్ ఖాన్ పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, ...
Read More »కళ్యాణం కమనీయం
రెంజల్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని రెంజల్, నీలా క్యాంప్, వీరన్నగుట్ట, సాటాపూర్ గ్రామాల్లో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని భక్తుల సమక్షంలో నిర్వహించారు. సీతారాముల ఉత్సవ విగ్రహాలను గ్రామాల్లోని ప్రధాన వీధులగుండా ఊరేగింపుగా నిర్వహించి ఆలయం వద్దకు తీసుకువచ్చారు. కల్యాణాన్నీ తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణం అనంతరం మొక్కలు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Read More »గొప్ప దార్శనికుడు అంబేడ్కర్
నరాల సుధాకర్ నిజామాబాద్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ 128వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని ఫులాంగ్ చౌరస్తావద్ద బాబా సాహేబ్ అంబేద్కర్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు. వంద సంవత్సరాల క్రిందటే ఒక అద్భుతమైన దూరదష్టితో సమ సమాజాన్ని నిర్మించిన గొప్ప దార్శనికుడు బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ...
Read More »అంతర్జాతీయ మేధావి డాక్టర్ అంబేడ్కర్
నందిపేట్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ మేధావి బీ.ఆర్.అంబేడ్కర్ అని నందిపేట్ ఎస్ఐ రాఘవేందర్ కొనియాడారు. బి.ఆర్ అంబేడ్కర్ 128వ జయంతి పురస్కరించుకొని అంబేడ్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రపంచ మేధావి అయిన అంబేడ్కర్ భారత దేశానికి ప్రపంచంలోకెల్లా అత్యున్నత రాజ్యాంగాన్ని రచించి దశ దిశను చూపి దేశపురోగతికి కృషి చేశారన్నారు. అంబేడ్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ బడుగు బలహీన ...
Read More »సామాజిక చైతన్యంతోనే అసమానతల తొలగింపు
జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు నిజామాబాద్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాన్యునికి హక్కు కల్పించిన గొప్ప స్ఫూర్తి ప్రదాత అని జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు అన్నారు. ఆదివారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 128 వ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతత్వం కలిగిన సామాజిక జీవనానికి బాటలు వేసేందుకు తన వంతు కషి చేశారని కలెక్టర్ అన్నారు. అంబేద్కర్ ...
Read More »ఘనంగా రాములోరి కళ్యాణం
ఆర్మూర్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని రామాలయంలో శ్రీరాముల వారి కల్యాణం భక్తులు ఘనంగా నిర్వహించారు. అందంగా ముస్తాబు చేసిన ఆలయంలో అశేష భక్తుల నడుమ కన్నుల పండువగా జరిగిన కళ్యాణం అందరిని ఆకట్టుకుంది. కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డితో పాటు తెరాస నాయకులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమనికి వేల సంఖ్యలో భక్తులు హాజరై శ్రీరాముని కళ్యాణ ప్రసాదం ...
Read More »ఘనంగా అంబేడ్కర్ జయంతి
కామారెడ్డి, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 128వ జయంతిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం ముందు మహనీయుని విగ్రహానికి ఎంసిపిఐ పార్టీ, ఐక్య బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా జయంతి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ అంబేద్కర్ 128వ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, అంబేద్కర్ అందరివాడని ...
Read More »శ్రీరామనవమి శుభాకాంక్షలు
రచన : పొలిమేర లక్ష్మణరావు ఛందస్సు : ఆటవెలది ఆ.వె కుర్ర వయసులోనె కూల్చి రక్కసులను భుజబలమును చాటె పుణ్యశాలి గురుని యాజ్ఞ నడచి హరుని విల్లువిరిచి జనకునల్లుడాయె సవ్యసాచి. ఆ.వె అతని పేరు పలుక హర్షము గలుగును అతని పథము నడువ వెతలు తొలగు కొలచు వారికతడు కొంగుబంగారమ్ము అట్టి రాజు గలడ మట్టి నందు.
Read More »