Breaking News
అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి నివాళులు అర్పిస్తున్న నేత‌లు

ఘనంగా అంబేడ్కర్‌ జయంతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 128వ జయంతిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ కార్యాలయం ముందు మహనీయుని విగ్రహానికి ఎంసిపిఐ పార్టీ, ఐక్య బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా జయంతి నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ అంబేద్కర్‌ 128వ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, అంబేద్కర్‌ అందరివాడని కానీ నేడు అంబేద్కర్‌ను మాల మాదిగలకే పరిమితం చేయడం వల్ల నిన్న రాజధాని నడిబొడ్డున పంజాగుట్టలోని విగ్రహాన్ని ధ్వంసం చేయడం చెత్తకుప్పలో వేయడాన్ని ఎంసిపిఐ పార్టీ ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠినచర్య తీసుకొని బిఆర్‌ అంబేద్కర్‌కు, వారి ఆశయాలకు స్ఫూర్తిగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

ఇందుకోసం సామాజిక ఉద్యమ సంఘాలతో కలిసి అంబేద్కర్‌ రాజ్యాంగం రక్షణకు అంబేద్కరిజాన్ని కాపాడేందుకు తగిన విధంగా పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జయంతి సందర్భంగా ఐక్య బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కొల్లూరి ప్రభాకర్‌, జిల్లా కార్యదర్శి అంతంపల్లి రమేష్‌, మద్దెల రాజు, రాజ గౌరవాధ్యక్షుడు తిరుపతి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు సిహెచ్‌ లీల, టీ.లక్ష్మి. భాగ్య, సరోజన, బాబా రవి, ఖాజా, సంతోష్‌, ప్రవీణ్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *