Breaking News
అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న బిసి సంక్షేమ సంఘం నాయకులు

గొప్ప దార్శనికుడు అంబేడ్కర్‌

నరాల సుధాకర్‌

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ 128వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్‌ నగరంలోని ఫులాంగ్‌ చౌరస్తావద్ద బాబా సాహేబ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు. వంద సంవత్సరాల క్రిందటే ఒక అద్భుతమైన దూరదష్టితో సమ సమాజాన్ని నిర్మించిన గొప్ప దార్శనికుడు బీఆర్‌ అంబేద్కర్‌ అని కొనియాడారు. వారి ఆధ్వర్యంలోనే బడుగు బలహీన వర్గాలు, దళితులు, సమాజానికి దూరంగా ఉన్న ప్రతి జాతికి మేలు కలిగిందని ఈ సందర్భంలో గుర్తు చేశారు.

అంబేద్కర్‌ ఒక కులానికో, ఒక జాతికో, ఒక వర్గానికో చెందిన వ్యక్తి కాదని, మొత్తం భారతదేశానికి చెందిన వ్యక్తి అని, ఆయన ఒక అద్భుత శక్తి అని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడం ఒక గొప్ప కార్యంగా భావిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు నరాల సుధాకర్‌ తెలిపారు. కార్యక్రమంలో నరాల సుధాకర్‌, బుస్స ఆంజనేయులు, దర్శనం దేవేందర్‌, కొయ్యాడ శంకర్‌, పొదిల శోభా, బోనేకర్‌ భూమన్న, గట్టాడి భూషణ్‌, సతీష్‌, కొట్టూర్‌ చంద్రకాంత్‌, రాజేశ్వర్‌, శ్రీలత, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *