Breaking News
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

అంబేడ్కర్‌ బాటలో యువత నడవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సమాజమే దేవాలయంగా భావించారని, ఆయన చూపిన బాటలో యువత నడిచి అన్ని రంగాల్లో రాణించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను మునిసిపల్‌ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. అంతకుముందు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. అణగారిన వర్గాలను అభివృద్ది మార్గంలో నడిపించి వారికోసం హక్కులు కల్పించి అందరికి అంబేడ్కర్‌ ఆదర్శప్రాయుడయ్యారన్నారు.

శరీరం, మనసు, ఆత్మ అనుసందానం ద్వారా అంబేడ్కర్‌ ఆశయాలను యువత ఆచరించి విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాజ్యాంగ రచన అందరికి సెక్యులర్‌ దేశంలో పవిత్రమైన పుస్తకమని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి శ్వేత, ఎస్‌సి సంక్షేమాధికారి అలీం, బిసి సంఘాల ప్రతినిధులు మల్లికార్జున్‌, మల్లన్న, సిద్దిరాములు, ఆజాద్‌, డాక్టర్‌ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *