Breaking News

అంతర్జాతీయ మేధావి డాక్టర్‌ అంబేడ్కర్‌

నందిపేట్‌, ఏప్రిల్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ మేధావి బీ.ఆర్‌.అంబేడ్కర్‌ అని నందిపేట్‌ ఎస్‌ఐ రాఘవేందర్‌ కొనియాడారు. బి.ఆర్‌ అంబేడ్కర్‌ 128వ జయంతి పురస్కరించుకొని అంబేడ్కర్‌ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రపంచ మేధావి అయిన అంబేడ్కర్‌ భారత దేశానికి ప్రపంచంలోకెల్లా అత్యున్నత రాజ్యాంగాన్ని రచించి దశ దిశను చూపి దేశపురోగతికి కృషి చేశారన్నారు.

అంబేడ్కర్‌ యువజన సంఘం మండల అధ్యక్షులు సురేష్‌ మాట్లాడుతూ బడుగు బలహీన అట్టడుగు వర్గాల ప్రజలకు ఎనలేని కషి చేసి ఎస్‌సి, ఎస్‌టి, బిఇ, మైనార్టీ ప్రజలు రాజ్యాధికారం కోసం కషి చేశారని వ్యాఖ్యానించారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేసి, ప్రధాన వీదుల గుండా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు బొర్రోల్ల సురేష్‌, ఎస్‌ఐ రాఘవేందర్‌, యువకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *