Breaking News

సామాజిక చైతన్యంతోనే అసమానతల తొలగింపు

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సామాన్యునికి హక్కు కల్పించిన గొప్ప స్ఫూర్తి ప్రదాత అని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అన్నారు. ఆదివారం రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో 128 వ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతత్వం కలిగిన సామాజిక జీవనానికి బాటలు వేసేందుకు తన వంతు కషి చేశారని కలెక్టర్‌ అన్నారు. అంబేద్కర్‌ ఆశయాలను ఆలోచనలను స్ఫూర్తిని ఆచరణలో తీసుకొని ముందుకు పోయినప్పుడే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళులు అని అన్నారు.

అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న అధికారులు

సమాజంలో అసమానతలు తొలగించేందుకు సామాజిక చైతన్యం అవసరమని చెప్పారు. అంబేద్కర్‌ ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాశారని రాజ్యాంగ రచనలో దూరదష్టితో అట్టడుగు వర్గాలకు న్యాయం చేసే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ జన్మత కష్టాలకు ఎదురీదుతూ ఉన్నత శిఖరాలకు ఎదిగారని అలాంటి స్ఫూర్తి మనం అలవర్చుకోవాలని, చదువుతోనే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని నిరూపించిన మహానుభావుని స్ఫూర్తిగా తీసుకొని ముందుకుపోవాలని, ఆయన 32 ఏళ్ల వరకు చదువుతూనే జీవితం కొనసాగించారని చెప్పారు. భారతదేశంలో పి హెచ్‌ డి పొందిన మొట్టమొదటి వ్యక్తి అని అంబేద్కర్‌ దూరదష్టిని కొలువలేమని స్వయంప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థలు ఏర్పాటుకు ఆయన దూరదష్టికి నిదర్శనమన్నారు.

రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని తద్వారా ప్రజల ఉన్నతికి ఆ పలాలు దోహద పడేందుకు విశేష కషి చేసిన ఆయన ఆశయాలను స్ఫూర్తిని యువత ఆచరించి ఆచరణలో పెట్టాలని అప్పుడే మనం అందించే నిజమైన నివాళి అని కలెక్టర్‌ చెప్పారు. బలహీన వర్గాలకు విద్య, ఉపాధి, ఆర్థిక ఎదుగుదలకు విశేష కషి చేశారని అన్నారు. అట్టడుగు వర్గాలకు ఆర్థికంగా సామాజికంగా అభివద్ధి చెందేందుకు వివిధ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్న వాటిని సద్వినియోగం చేసుకోవాలని, పూ లాంగ్‌ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహ ఆవరణలో ఎలాంటి హోర్డింగ్‌లు, ప్లెక్సీలు పెట్టకుండా ఇంతకుముందే నగరపాలక కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చామని మరొకసారి పునరావతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని ఆయన అన్నారు. ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ కల్పించి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు కషి చేస్తామని అన్నారు.

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరైన వారికి ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసిన తర్వాత అందజేస్తామని కలెక్టర్‌ చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతకుముందు పూలాంగ్‌ చౌరస్తా వద్దగల అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జయంతి వేడుకల కార్యక్రమంలో నిజామాబాద్‌ ఆర్టీవో వెంకటేశ్వర్లు, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు సయ్యద్‌ సబీల్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈ.డి శశికళ, ఏఎస్‌డబ్లుఓ భూమయ్య, దళిత సంఘాల నాయకులు బంగారు సాయిలు, గంగారం, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *