Breaking News
మండలకేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న జడ్పీటిసి నాగభూషన్‌ రెడ్డి

ఘనంగా విశ్వమేధావి జయంతి వేడుకలు

రెంజల్‌, ఏప్రిల్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచమేధావి, విశ్వరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 128వ జయంతి వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహానికి జడ్పీటీసీ నాగభూషన్‌ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొర్గం, వీరన్నగుట్ట గ్రామాల్లో ఎంపిపి మోబిన్‌ ఖాన్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ఎంపీపీ మోబిన్‌ ఖాన్‌

పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, సర్పంచ్‌లు, వివిధ నాయకులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడిచినప్పుడే ఆయన ఆశయసాధనకు కషి చేసినవారమవుతామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు తెలివితో, జ్ఞానంతో మహా రాజ్యాంగాన్ని రాసి దేశానికి దశ దిశ మార్గనిర్దేశం చేశారని అన్నారు. కార్యక్రమంలో సంతోష్‌, మదన్‌, ప్రవీణ్‌, కిరణ్‌, రవి, సమేల్‌, నవీన్‌, సాయరెడ్డి, నర్సయ్య, హన్మంత్‌ రావ్‌, సాయిలు, లింగం, శ్రీనివాస్‌, అనంత్‌రావ్‌, మోహన్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ఎంపీపీ మోబిన్‌ ఖాన్‌

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *