Breaking News
అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం ఇస్తున్న కార్మికులు

అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి

కామారెడ్డి, ఏప్రిల్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని కార్మికులు ఆదివారం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ వర్కర్స్‌ ఆధ్వర్యంలో కార్మికులు ఆసుపత్రి నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి రోడ్డుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్‌ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికులకు రావాల్సిన మూడునెలల వేతనాలు ఇవ్వకుండా వారిని వేధిస్తు వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బాల్‌రాజు, రఫీక్‌, స్వరూప, గంగాధర్‌, నర్సింలు, మమత, సునీత, పద్మ, సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *