Breaking News

శ్రీరామనవమి శుభాకాంక్షలు

రచన : పొలిమేర లక్ష్మణరావు

ఛందస్సు : ఆటవెల‌ది

ఆ.వె

కుర్ర వయసులోనె కూల్చి రక్కసులను

భుజబలమును చాటె పుణ్యశాలి

గురుని యాజ్ఞ నడచి హరుని విల్లువిరిచి

జనకునల్లుడాయె సవ్యసాచి.

ఆ.వె

అతని పేరు పలుక హర్షము గలుగును

అతని పథము నడువ వెతలు తొలగు

కొలచు వారికతడు కొంగుబంగారమ్ము

అట్టి రాజు గలడ మట్టి నందు.

Check Also

సమస్యల పరిష్కారానికి కమీషనర్‌ హామీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *