Breaking News
సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న పండితులు

కళ్యాణం కమనీయం

రెంజల్‌, ఏప్రిల్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని రెంజల్‌, నీలా క్యాంప్‌, వీరన్నగుట్ట, సాటాపూర్‌ గ్రామాల్లో ఆదివారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణాన్ని భక్తుల సమక్షంలో నిర్వహించారు. సీతారాముల ఉత్సవ విగ్రహాలను గ్రామాల్లోని ప్రధాన వీధులగుండా ఊరేగింపుగా నిర్వహించి ఆలయం వద్దకు తీసుకువచ్చారు.

కల్యాణాన్నీ తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణం అనంతరం మొక్కలు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *