Breaking News

రామాలయంలో కలెక్టర్‌ ప్రత్యేక పూజలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరామ నవమి సందర్భంగా డిచ్‌పల్లి రామాలయంలో జరిగిన సీతారామ కళ్యాణ మహోత్సవాల్లో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావ్‌ సతీ సమేతంగా హాజరై పూజలు చేశారు. కలెక్టర్‌ రాక సందర్భంగా దేవస్థాన ఆలయ కమిటీ, పూజారులు కలెక్టర్‌ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ గుడిలోకి తీసుకెళ్ళి అర్చన చేశారు.

అనంతరం ఆలయ అవరణలో జరిగిన సీతా రామ కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సతీమణి శ్రీ సీతారామచంద్రస్వామి వారికి హారతులిచ్చారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *