Daily Archives: April 15, 2019

కార్మికుల వేతనాలు చెల్లించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో కార్మికులకు వేతనాలు ఇవ్వాలని ఆర్‌ఎంఓ శ్రీనివాస్‌కు మెడికల్‌ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు (ఏఐటియుసి అనుబంధ సంస్థ) వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ కార్మికులకు జీతాలు రాక మూడు నెలలు అవుతుందన్నారు. అధికారులు కూడా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని అన్నారు. ఆర్‌ఎంవొ శ్రీనివాస్‌ వినతి పత్రం ఇవ్వగా, ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లో కార్మికులకు మూడు నెలల ...

Read More »

గ్రామ కార్యదర్శులు గ్రామాల అభివృద్దికి తోడ్పడాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా నియమించబడ్డ గ్రామస్థాయి జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ది పరిచేందుకు పూర్తిస్థాయి నిబద్దతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సోమవారం కామారెడ్డిలో పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటైన శిక్షణకార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2018 పంచాయతీ రాజ్‌ చట్టం సూచన మేరకు గ్రామాలలో మౌలిక సదుపాయాలు, హరితహారంలో భాగంగా నర్సరీలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. అన్నాహజారేను ఆదర్శంగా తీసుకొని గ్రామాలను పరిపూర్ణంగా అభివృద్ది పరచాలని పేర్కొన్నారు. సమావేశంలో డిపివో ...

Read More »

ప్రజావాణిలో 42 ఫిర్యాదులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జనహితలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 42 పిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. అత్యధికంగా రెవెన్యూశాఖకు సంబంధించి 20 ఫిర్యాదులు, డిపివో 6 ఫిర్యాదులు అందాయన్నారు. ఇతర శాఖలకు సంబంధించి మిగతా ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అదికారులకు ఉత్తర్వులు జారీచేసినట్టు పేర్కొన్నారు.

Read More »

స్థానిక ఎన్నికల్లో అధికారులు ఖచ్చితంగా విధులు నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ, పార్లమెంటు, సర్పంచ్‌ ఎన్నికల్లో విధులు నిర్వహించినట్టే అధికారులు జడ్పిటిసి, ఎంపిటిసి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితమైన విదులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సోమవారం ఎన్నికల విదులపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో నామినేషన్‌, స్క్రూటిని, ఉపసంహరణ చేపట్టాలన్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం అనుసరించి ఎటువంటి నేరారోపణలు ఉన్నా అభ్యర్థి పోటీచేసినా వారి నామినేషన్‌ తిరస్కరించాలని స్పష్టం చేశారు. ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన నిర్వహించబడతాయని, బ్యాలెట్‌ ...

Read More »

పట్టా పుస్తకాలను సరిచేసి దోషరహిత గ్రామాలుగా ప్రకటించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్డీవోలు, ఎమ్మార్వోలు వారంరోజుల్లో గ్రామాల వారిగా సందర్శించి రైతుల పట్టా పాసుపుస్తకాలను సరిచేసి వందశాతం దోషరహిత గ్రామాలుగా ప్రకటించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. ఎల్‌ఆర్‌యుపిలో భాగంగా డిజిటల్‌ పాసుపుస్తకాల్లో తప్పులు నమోదైన రైతుల నుంచి వాటిని సరిచేసి వెంటనే కొత్త పాసుపుస్తకాలు ఇవ్వాలని సూచించారు. అర్హులైన వారికి సాదా బైనామా, పిఓటి భూముల కేటాయింపు పరిశీలన జరిపి అందించాలన్నారు. ...

Read More »

బాధ్యత లేకుండా పరిపాలిస్తున్నారు

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బహుజన ఫ్రంట్‌ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. ఈ నెల 13న శనివారం హైదరాబాద్‌ పంజాగుట్టలో భారత రాజ్యాంగ నిర్మాత డా:బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చివేతకు కారణమయిన వారిపై ఎస్సి/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత బహుజన ఫ్రంట్‌ జిల్లా అధ్యక్షులు బత్తుల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించక పోవడం సిగ్గుచేటన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ...

Read More »

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో భవననిర్మాణ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న 25 లక్షల మంది కార్మికులకు కేవలం 13 లక్షల మందిని గుర్తించారని మిగిలిన కార్మికులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంపెయిన్‌ చేపట్టాలని, కార్మికుల గుర్తింపు కార్డుల రెన్యువల్‌ కోసం మూడు నెలల నిబంధన ఎత్తివేయాలని, ప్రధానమంత్రి శ్రమ యోజన మన్‌ధన్‌ పెన్షన్‌ స్కీమ్‌ నుండి నిర్మాణరంగ కార్మికులను మినహాయించి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు చట్టం ప్రకారం 60 సంవత్సరాలు నిండిన ...

Read More »

జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలలో ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. సోమవారం మధ్యాహ్నం మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన జెడ్‌పిటిసి ఎంపీటీసీ రిటర్నింగ్‌ అధికారుల శిక్షణా తరగతులలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పంచాయతీ రాజ్‌ చట్టం నియమ నిబంధనల మేరకు ఏలాంటి షార్ట్‌కట్స్‌ లేకుండా వందకు వందశాతం నియమాలు పాటించాలన్నారు. నామినేషన్ల స్వీకరణ గుర్తుల కేటాయింపు పరిశీలన సందర్భంగా చట్టబద్ధంగా నియమ ...

Read More »

జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు సమన్వయంతో నిర్వహించాలి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే జెడ్‌పిటిసి ఎంపీటీసీల ఎన్నికలు సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించేందు కషి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జెడ్‌పిటిసి ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులతో ఏర్పాటుచేసిన శిక్షణ తరగతుల్లో కలెక్టర్‌ మాట్లాడుతూ చట్టబద్ధమైన విధుల సందర్భంలో సంబంధించిన మార్గదర్శకాలు సూచనలు ఆర్డర్ల ప్రకారంగా నిర్వహించాలన్నారు. ఎన్నికలలో నామినేషన్‌ స్వీకరణ, పరిశీలన, సింబల్‌ కేటాయింపులలో నియమ నిబంధనల మేరకు పాటించాలన్నారు. నామినేషన్ల ...

Read More »

ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో శిక్షణపై కలెక్టర్‌ ప్రశంస

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రంలో అతి తక్కువ కాలంలో ఎక్కువ మందికి శిక్షణ అందించినందుకు గాను అవార్డు పొందినందుకు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అభినందించారు. సోమవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డి జిల్లా ప్రాంతీయ శిక్షణ మేనేజర్‌ ఆంజనేయులు జిల్లా కలెక్టర్‌ను ఆయన ఛాంబర్లో కలిశారు. స్థానిక టీఎన్జీవోస్‌ హోమ్‌లో జనవరి 2019లో ప్రారంభించుకున్న కంప్యూటర్‌ ల్యాబ్‌లో మార్చి కల్లా మూడు మాసాలలో 2,200 మంది ఉద్యోగులకు కంప్యూటర్‌లో పలు కోర్సులలో శిక్షణ అందించామని ...

Read More »

అధికారుల దిగ్బందం

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం తెలంగాణ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆద్వర్యంలో కామారెడ్డి జిల్లా లెబర్‌ కార్యాలయాన్ని ముట్టడించి, జిల్లా లేబర్‌ ఆదికారులు, అసిస్టెంట్‌ లేెబర్‌ ఆదికారి, ప్రభుదాసు, లేబర్‌ ఆదికారి గోపిరెడ్డిని, సిబ్బందిని రెండు గంటలపాటు దిగ్బందించినట్టు జిల్లా అధ్యక్షుడు నాగన్న తెలిపారు. కామారెడ్డిలో లేబర్‌ ఆదికారి గోపిరెడ్డి, బిల్డింగ్‌ కార్మికుల సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని, కార్మికుల పట్ల దురుసుగా వ్యవహరించడం, కార్మికులు చెప్పులు అరిగె వరకు ...

Read More »

వైద్యులను నియమించండి

నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను నియమించాలని కోరుతూ ఎంపిపి నక్కగంగాధర్‌ కామరెడ్డి డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉందని, దీంతో రోగులకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న వైద్యులలో ఒకరు మెటర్నిటి సెలవులో ఉండగా, మరొకరికి వివాహం ఉన్నందున సెలవులో ఉన్నారన్నారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను, వార్డు బాయ్‌లను నియమించాలని కోరారు.

Read More »

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం

నందిపేట్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థ ఎన్నికలైన ఎంపిటిసి, జడ్‌పిటిసి స్థానాల ఎన్నికలలో పోటీ కొరకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పెంట ఇంద్రుడు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడైనా సిద్ధమేనని చెప్పారు. ఒక్క ఎంపిటిసి స్థానం నుండి నలుగురు చొప్పున అభ్యర్థులు కాంగ్రెస్‌ పార్టీ బి.ఫామ్‌ కోసం పోటీ ఉందన్నారు. ...

Read More »