Breaking News
విలేకరులతో మాట్లాడుతున్న పెంట ఇంద్రుడు

ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధం

నందిపేట్‌, ఏప్రిల్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థ ఎన్నికలైన ఎంపిటిసి, జడ్‌పిటిసి స్థానాల ఎన్నికలలో పోటీ కొరకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు పెంట ఇంద్రుడు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడైనా సిద్ధమేనని చెప్పారు. ఒక్క ఎంపిటిసి స్థానం నుండి నలుగురు చొప్పున అభ్యర్థులు కాంగ్రెస్‌ పార్టీ బి.ఫామ్‌ కోసం పోటీ ఉందన్నారు.

అలాగే జడ్‌పిటిసి కొరకు కూడా నలుగురు అభ్యర్థులు కాంగ్రెస్‌ పార్టీ బి.ఫామ్‌ కోసం పోటీలో ఉన్నారన్నారు. నందిపేట్‌ మండలంలోని అత్యధిక స్థానాలు కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమములో యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు మంద మహిపాల్‌, ఉస్మాన్‌, కాంగ్రెస్‌ నాయకులు దేగం గంగారెడ్డి, తమ్మల దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *