Breaking News

బాధ్యత లేకుండా పరిపాలిస్తున్నారు

కామారెడ్డి, ఏప్రిల్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బహుజన ఫ్రంట్‌ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. ఈ నెల 13న శనివారం హైదరాబాద్‌ పంజాగుట్టలో భారత రాజ్యాంగ నిర్మాత డా:బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని కూల్చివేతకు కారణమయిన వారిపై ఎస్సి/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత బహుజన ఫ్రంట్‌ జిల్లా అధ్యక్షులు బత్తుల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించక పోవడం సిగ్గుచేటన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కూల్చివేసిన స్థలంలోనే డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాన్ని యధావిధిగా పునర్నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు.

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంబేడ్కర్‌ జయంతి రోజున భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌.అంబేద్కర్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించి వంగి నమస్కరించారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రం భారత రాజ్యాంగంపైన, డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ పైన గౌరవం లేదన్నారు. కనీసం పూలమాల వేసే బాధ్యత కూడా లేకుండా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి రాష్ట్రానికి పరిపాలించే భాధ్యత ఆయనకు లేదన్నారు. అనంతరం డి.ఆర్‌.డి. ఓ.గారికి దళిత బహుజన రిసోర్సు సెంటర్‌ జిల్లా కోఆర్డినేటర్‌ తలారి ప్రభాకర్‌ వినతి పత్రం అందజేశారు.

ఉపాధి హామీ పథకం పని ప్రదేశంలో పని వద్ద కూలీలకు కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల కూలీలకు వడదెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి టెంట్లు, నీరు, మెడికల్‌ కీట్స్‌, ఓ.ఆర్‌.యస్‌. ప్యాకెట్స్‌ అందేలా చూడాలని కోరారు. దానికి డిఆర్‌డివో స్పందించి కనీస సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఒకవేళ ఉండనిచో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నుండి ఏ.పీ.ఓల వరకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో డి.బి.యఫ్‌. గౌరవ అధ్యక్షులు సోమ దేవయ్య, ముక్కు సరోజన, బాలసాయి, కాశవ్వా, సిద్దు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *