Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

స్థానిక ఎన్నికల్లో అధికారులు ఖచ్చితంగా విధులు నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ, పార్లమెంటు, సర్పంచ్‌ ఎన్నికల్లో విధులు నిర్వహించినట్టే అధికారులు జడ్పిటిసి, ఎంపిటిసి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితమైన విదులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సోమవారం ఎన్నికల విదులపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో నామినేషన్‌, స్క్రూటిని, ఉపసంహరణ చేపట్టాలన్నారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం అనుసరించి ఎటువంటి నేరారోపణలు ఉన్నా అభ్యర్థి పోటీచేసినా వారి నామినేషన్‌ తిరస్కరించాలని స్పష్టం చేశారు. ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన నిర్వహించబడతాయని, బ్యాలెట్‌ పేపర్‌ మాత్రమే వినియోగిస్తారని పేర్కొన్నారు. ఎన్నికలు పటిష్టంగా నిర్వహించాలని ఆదేశించారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *