Breaking News

ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో శిక్షణపై కలెక్టర్‌ ప్రశంస

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న శిక్షణ కేంద్రంలో అతి తక్కువ కాలంలో ఎక్కువ మందికి శిక్షణ అందించినందుకు గాను అవార్డు పొందినందుకు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అభినందించారు. సోమవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డి జిల్లా ప్రాంతీయ శిక్షణ మేనేజర్‌ ఆంజనేయులు జిల్లా కలెక్టర్‌ను ఆయన ఛాంబర్లో కలిశారు.

స్థానిక టీఎన్జీవోస్‌ హోమ్‌లో జనవరి 2019లో ప్రారంభించుకున్న కంప్యూటర్‌ ల్యాబ్‌లో మార్చి కల్లా మూడు మాసాలలో 2,200 మంది ఉద్యోగులకు కంప్యూటర్‌లో పలు కోర్సులలో శిక్షణ అందించామని కలెక్టర్‌కు వివరించారు. అతి తక్కువ సమయంలో పలు రకాల కోర్సులలో 2,200 మందికి శిక్షణ అందించినందుకు గాను ఎంసీఆర్హెచ్‌ఆర్డీ డైరెక్టర్‌ జనరల్‌ బీపీ ఆచార్య జిల్లాకు అవార్డు అందజేశారని ఆయన కలెక్టర్‌ కు వివరించారు.

తనతోపాటు సిబ్బందికి కూడా ప్రశంసా పత్రాలు అందజేశారన్నారు. ఇందుకుగాను ఆంజనేయులును, సిబ్బందిని అభినందిస్తూ, ముందు ముందు మరింత ఎక్కువ మంది ఉద్యోగులకు శిక్షణ అందించి పరిపాలనలో మెళకువలు నేర్పించాలని, ఫైళ్లు సమర్పించే విధానం, పథకాల అమలుకు సంబంధించి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడంలో అధికారులు, సిబ్బంది చురుకైన విధులు నిర్వహించడానికి అవసరమైన సలహాలు అందించాలని సూచించారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *