Breaking News
మాట్లాడుతున్న కలెక్టర్‌

జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే జెడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలలో ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. సోమవారం మధ్యాహ్నం మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన జెడ్‌పిటిసి ఎంపీటీసీ రిటర్నింగ్‌ అధికారుల శిక్షణా తరగతులలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పంచాయతీ రాజ్‌ చట్టం నియమ నిబంధనల మేరకు ఏలాంటి షార్ట్‌కట్స్‌ లేకుండా వందకు వందశాతం నియమాలు పాటించాలన్నారు.

నామినేషన్ల స్వీకరణ గుర్తుల కేటాయింపు పరిశీలన సందర్భంగా చట్టబద్ధంగా నియమ నిబంధనల మేరకు పాటించాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో అన్ని అంశాలకు సంబంధిత ఆర్‌వోలే పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని, నామినేషన్ల స్వీకరణ తుది గడువు పూర్తయిన తర్వాత పరిశీలన తేది కంటే ముందు రోజే పూర్తి చేసుకోవాలని, బ్యాలెట్‌ పేపర్లు పోస్టల్‌ బ్యాలెట్‌ ముద్రణలో ఎలాంటి పొరపాట్లు తప్పులు గాని లేకుండా చూడాలన్నారు. సింబల్‌ కేటాయింపులో నిర్దేశిత ప్రకారంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నామినేషన్ల చెల్లుబాటు అయిన విషయాన్ని వారికి తెలియజేయాలని, పరిశీలన ప్రక్రియను క్షుణ్నంగా పరిశీలించాలని ఎన్నికల విధులు సాధారణ విధులకు కంటే విభిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు.

ఎన్నికలు చట్టబద్ధమైన బాధ్యత కాబట్టి నియమ నిబంధనలు నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఉండాలని, ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ అన్నారు. నామినేషన్‌ వేసే అభ్యర్థుల అర్హతలను క్షుణ్నంగా పరిశీలన చేయాలని చెప్పారు. 299 ఎంపీటీసీలకు, 25 జడ్పీటీసీలకు జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్‌ చెప్పారు. కార్యక్రమంలో ఆర్టీవో శ్రీనివాస్‌, ఎంపీడీవో మాస్టర్‌ ట్రైనీలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాలుగు మున్సిపాలిటీలలో 25వ తేదీ శనివారం ఉదయం 8 ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *