Breaking News

జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు సమన్వయంతో నిర్వహించాలి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే జెడ్‌పిటిసి ఎంపీటీసీల ఎన్నికలు సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించేందు కషి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జెడ్‌పిటిసి ఎంపీటీసీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులతో ఏర్పాటుచేసిన శిక్షణ తరగతుల్లో కలెక్టర్‌ మాట్లాడుతూ చట్టబద్ధమైన విధుల సందర్భంలో సంబంధించిన మార్గదర్శకాలు సూచనలు ఆర్డర్ల ప్రకారంగా నిర్వహించాలన్నారు. ఎన్నికలలో నామినేషన్‌ స్వీకరణ, పరిశీలన, సింబల్‌ కేటాయింపులలో నియమ నిబంధనల మేరకు పాటించాలన్నారు. నామినేషన్ల పరిశీలన రిటర్నింగ్‌ అధికారి పూర్తి బాధ్యత వహించాలని, శిక్షణ కార్యక్రమంలో ఏవైనా అనుమానాలు ఇప్పుడే నివత్తి చేసుకొని ఎన్నికల సందర్భంలో సమర్థంగా నిర్వహించేందుకు కషి చేయాలన్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా నామినేషన్ల స్వీకరణ పరిశీలన గుర్తుల కేటాయింపు సమయానుసారంగా పూర్తి చేయాలని, అసెంబ్లీ పార్లమెంట్‌ ఎన్నికలకు భిన్నంగా ఎన్నికలు ఉంటాయని చెప్పారు. గుర్తుల కేటాయింపులో నాలుగు కేటగిరీలుగా ఉంటాయని మొదటి కేటగిరి గుర్తింపు పొందిన జాతీయ రాష్ట్ర పార్టీలు, రెండవ కేటగిరిలో రిజిస్టర్‌ కాబడిన గుర్తు రిజర్వుడు పార్టీలు, మూడో కేటగిరిలో రిజిస్టరై ఎలాంటి గుర్తు లేని పార్టీలు, నాలుగు కేటగిరీల్లో స్వతంత్ర అభ్యర్థులు గుర్తులు కేటాయింపు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు కొత్తగా సింబల్‌ను పంపించే అవకాశముందని ఆదేశించిన ప్రకారంగా సింబల్‌లో కేటాయింపు చేయాలన్నారు.

నామినేషన్‌ ప్రక్రియలో అర్హత గలవారిని అనర్హత చేయకుండా అనర్హత గల వారిని అర్హత చేయకూడదన్నారు. నామినేషన్‌ పత్రాలతోపాటు అఫిడవిట్‌ సమర్పించాలని పేర్కొన్నారు. పోలింగ్‌ స్టేషన్లలో సౌకర్యాలు పోలింగ్‌ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌ స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాటు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకోవాలని కలెక్టర్‌ అన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వేణు, డిప్యూటీ సీఈవో గోవిందు, మాస్టర్‌ ట్రైనీలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *