Breaking News
అధికారుల‌తో మాట్లాడుతున్న కార్మికులు

అధికారుల దిగ్బందం

కామారెడ్డి, ఏప్రిల్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం తెలంగాణ బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆద్వర్యంలో కామారెడ్డి జిల్లా లెబర్‌ కార్యాలయాన్ని ముట్టడించి, జిల్లా లేబర్‌ ఆదికారులు, అసిస్టెంట్‌ లేెబర్‌ ఆదికారి, ప్రభుదాసు, లేబర్‌ ఆదికారి గోపిరెడ్డిని, సిబ్బందిని రెండు గంటలపాటు దిగ్బందించినట్టు జిల్లా అధ్యక్షుడు నాగన్న తెలిపారు.

కామారెడ్డిలో లేబర్‌ ఆదికారి గోపిరెడ్డి, బిల్డింగ్‌ కార్మికుల సమస్యల పట్ల పూర్తిగా నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని, కార్మికుల పట్ల దురుసుగా వ్యవహరించడం, కార్మికులు చెప్పులు అరిగె వరకు లెబర్‌ కార్యాలయం చుట్టు తిరిగినా లెబర్‌ కార్డులను రినివల్‌ చేయకుండా లేనిపొని మాటలతో కార్మికులకు చెప్పి పంపడం, లేబర్‌ కార్డులు రినివల్‌ టైం అయిపోయిందని, కొత్తగా లెబర్‌ కార్డులకు అప్లయి చెయడం కొసం కార్మికులు లెబర్‌ ఆపిసులకు వెళితే కార్మికులను వెనక్కి పంపడం చేస్తున్నారన్నారు. కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందకుండా చేయడం, కార్మికులకు తీరని నష్టం జరుగుతున్నందున, కార్మికులు తీవ్ర ఆగ్రహంతో సోమవారం కామారెడ్డి లెబర్‌ ఆదికారుల నిర్లక్షవ్తెఖరికి నిరసనగా, లేబర్‌ అదికారులు ఎప్పుడు కార్మికులకు అందుబాటులో ఉండాలని, లేబర్‌ కార్డులను తక్షణమే రినివల్‌ చేయాలని, లేబర్‌ ఆదికారులు మొద్దు నిద్ర వీడి కార్మికులకు న్యాయం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇన్‌చార్జి అసిస్టెంట్‌ లెబర్‌ కమిషనర్‌ ప్రభుదాసు, లెబర్‌ ఆదికారి గోపిరెడ్డి కార్మికుల ఆందోళనకు దిగివచ్చి, రెండు రోజుల్లో పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలు తమ యునియన్‌ నాయకుల సమక్షంలో పరిష్కారం చేస్తామని ఇచ్చిన హమితో ఆందోళన విరమించినట్టు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అద్యక్షులు నాగన్న, జిల్లా కార్యదర్శి సిద్దిరాములు, జిల్లా నాయకులు రాజానర్సు, బిల్డింగ్‌ వర్కర్స్‌ యునియన్‌ జిల్లా నాయకులు నర్సన్న, మస్తాన్‌, రాములు, రమేష్‌, షకిల్‌, సాయిలు, లక్మ్షి, రాజామణి, తదితరులు పాల్గోన్నారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *