Breaking News

పట్టా పుస్తకాలను సరిచేసి దోషరహిత గ్రామాలుగా ప్రకటించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్డీవోలు, ఎమ్మార్వోలు వారంరోజుల్లో గ్రామాల వారిగా సందర్శించి రైతుల పట్టా పాసుపుస్తకాలను సరిచేసి వందశాతం దోషరహిత గ్రామాలుగా ప్రకటించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. ఎల్‌ఆర్‌యుపిలో భాగంగా డిజిటల్‌ పాసుపుస్తకాల్లో తప్పులు నమోదైన రైతుల నుంచి వాటిని సరిచేసి వెంటనే కొత్త పాసుపుస్తకాలు ఇవ్వాలని సూచించారు. అర్హులైన వారికి సాదా బైనామా, పిఓటి భూముల కేటాయింపు పరిశీలన జరిపి అందించాలన్నారు. బీర్కూర్‌లో 97 శాతంతో పాసుపుస్తకాల్లో రైతుల ఖచ్చిత సమాచారాన్ని పొందుపరిచారని ప్రశంసించారు. వేసవి దృష్ట్యా మిషన్‌ భగీరథ ఏజెన్సీలు నీటి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.

జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు 3500 కొత్త పాసుపుస్తకాలు వచ్చాయని పేర్కొన్నారు. వీటిని గ్రామసమాఖ్య ఆద్వర్యంలో పంపిణీ చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న 28 వేల ఎకరాల వివాదాస్పద భూములపై అటవీ, రెవెన్యూశాఖలు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *