Breaking News
వినతి పత్రం ఇస్తున్న కార్మికులు

కార్మికుల వేతనాలు చెల్లించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో కార్మికులకు వేతనాలు ఇవ్వాలని ఆర్‌ఎంఓ శ్రీనివాస్‌కు మెడికల్‌ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు (ఏఐటియుసి అనుబంధ సంస్థ) వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ కార్మికులకు జీతాలు రాక మూడు నెలలు అవుతుందన్నారు. అధికారులు కూడా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని అన్నారు.

ఆర్‌ఎంవొ శ్రీనివాస్‌ వినతి పత్రం ఇవ్వగా, ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లో కార్మికులకు మూడు నెలల వేతనాన్ని ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు సమ్మె విరమించుకోవడం జరిగిందన్నారు. ఒకవేళ జీతాలు ఇవ్వకపోతే కార్మికులు మళ్ళీ సమ్మెకు సిద్ధమవుతారని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌ అన్నారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కోశాధికారి పి.బాలరాజు, రఫిక్‌, స్వరూప, మమత, నర్సింలు, సూర్యచంద్ర, గంగాధర్‌, బైరమ్మ, ఫాజియా, లక్ష్మీ, పద్మ, శ్రీనివాస్‌, సునీత, కార్మికులు ఉన్నారు.

Check Also

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *