Breaking News

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో భవననిర్మాణ రంగాలపై ఆధారపడి జీవిస్తున్న 25 లక్షల మంది కార్మికులకు కేవలం 13 లక్షల మందిని గుర్తించారని మిగిలిన కార్మికులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక క్యాంపెయిన్‌ చేపట్టాలని, కార్మికుల గుర్తింపు కార్డుల రెన్యువల్‌ కోసం మూడు నెలల నిబంధన ఎత్తివేయాలని, ప్రధానమంత్రి శ్రమ యోజన మన్‌ధన్‌ పెన్షన్‌ స్కీమ్‌ నుండి నిర్మాణరంగ కార్మికులను మినహాయించి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు చట్టం ప్రకారం 60 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికునికి పెన్షన్‌ స్కీం అమలు చేయాలని కోరుతూ ఏఐసిటియు అనుబంధ ఐక్య బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.

రాష్ట్ర కమిషనర్‌ ఎండి నదీం వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఐక్య బిల్లింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు అనిల్‌ కుమార్‌, రాజలింగం ఐసిటియు రాష్ట్ర అధ్యక్షుడు గోనె కుమారస్వామి, ఎంసిపిఐ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ కార్యదర్శి సంగతి సాంబయ్య, ఐక్య బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు కొల్లూరి ప్రభాకర్‌, కుమ్మరి తిరుపతి, కుమ్మరి స్వామిలతో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రతినిధులు పాల్గొనడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ రాష్ట్ర కమిషనర్‌ సానుకూలంగా స్పందిస్తూ సమస్యలు పరిష్కరించి భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేస్తామని ఐక్య బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకత్వం యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపెయిన్‌ నిర్వహించి రెన్యువల్‌గాని కార్మికులను చైతన్యపరిచే అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు.

దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రెన్యువల్‌ కాకుండా మిగిలి పోయిన ఆరు లక్షల మంది కార్మికులకు న్యాయం చేసేందుకు కషి చేయాలని సూచించారు. నిర్మాణ కార్మికుల సమస్యలు తన దష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కరించేందుకు ఆయా జిల్లాల్లోని డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌లకు ఆదేశాలు ఇచ్చి న్యాయం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *