Breaking News

గ్రామ కార్యదర్శులు గ్రామాల అభివృద్దికి తోడ్పడాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతనంగా నియమించబడ్డ గ్రామస్థాయి జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ది పరిచేందుకు పూర్తిస్థాయి నిబద్దతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సోమవారం కామారెడ్డిలో పంచాయతీ కార్యదర్శులతో ఏర్పాటైన శిక్షణకార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

2018 పంచాయతీ రాజ్‌ చట్టం సూచన మేరకు గ్రామాలలో మౌలిక సదుపాయాలు, హరితహారంలో భాగంగా నర్సరీలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. అన్నాహజారేను ఆదర్శంగా తీసుకొని గ్రామాలను పరిపూర్ణంగా అభివృద్ది పరచాలని పేర్కొన్నారు. సమావేశంలో డిపివో సాయన్న, ఆర్డీవో తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిఆర్వో కార్యాలయం తనిఖీ

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు శనివారం డిఆర్‌ఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *