జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు నిజామాబాద్, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలనకు అభ్యర్థులను లేదా అధికారికంగా నియమించబడిన ఏజెంట్‌ను నిబంధనల మేరకు అనుమతించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు లేదా వారి నుండి అధికారికంగా అనుమతి పొందిన ఎన్నికల ఏజెంట్లను ఈవీఎంలు భద్రపరచిన గదులను సి.సి.కెమెరాల రికార్డింగ్ ఉన్నంతవరకు పరిశీలించడానికి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అనుమతించడం జరుగుతుందని చెప్పారు. ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్ రూంలకు ...
Read More »Daily Archives: April 16, 2019
ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
రెంజల్, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మే నెలలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సాధారణ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఎంపీడీవో చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 గ్రామాల ఎంపిటిసిలకు గాను ప్రిసైడింగ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్లకు ప్రతి ఒక్కరూ ఎన్నికల విధి విధానాల ప్రక్రియ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికల ముందు రోజు ...
Read More »సమస్యల పరిష్కారానికి కమీషనర్ హామీ
కామారెడ్డి, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయం టంగుటూరి అంజయ్య భవన్ ముందు నిర్వహించిన నిరసన అనంతరం రాష్ట్ర కమిషనర్ ఎండి నదీమ్ ఐక్య బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన వినతి పత్రంపై కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, గౌరవ అధ్యక్షులు సిహెచ్ తిరుపతి, ప్రధాన కార్యదర్శి అంతంపల్లి రమేష్, సహాయ కార్యదర్శి రాజలింగం మాట్లాడారు. భవన ...
Read More »స్థానిక ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సర్పంచ్, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించుకున్నామని, అదే క్రమంలో ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సిబ్బందికి సూచించారు. మంగళవారం ఆయన గాంధారి, సదాశివనగర్ మండలాల్లో పివో, ఏపివోల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నూతన పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఎన్నికల నియమావళిని అనుసరించి అధికారులు ఎన్నికల విధులు నిర్వహించాలని చెప్పారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా గత ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికలను విజయవంతంగా ...
Read More »అటవీభూములపై పూర్తిస్థాయి సర్వే జరపాలి
కామారెడ్డి, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో రెవెన్యూ డివిజన్ల వారిగా ప్రభుత్వ భూములపై పూర్తిస్థాయి సర్వే నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. మంగళవారం ఆయన రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ డివిజన్ల వారిగా ప్రభుత్వ భూములు, పట్టా, సేత్వార్, ఖాస్రా భూములపై నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీకి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించినట్టు తెలిపారు. రామారెడ్డి మండలం ఉగ్రవాయి ప్రభుత్వ బూములు, అసైన్డ్ భూములు, అటవీభూములపై సమీక్షించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Read More »రైలుకింద పడి యువకుని మృతి
కామరెడ్డి, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైలు కిందపడి యువకుడు మృతి చెందినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు కామారెడ్డి హరిజనవాడకు చెందిన గంగరాజు (22) గా గుర్తించినట్టు పేర్కొన్నారు. మృతుడు ప్రమాదవశాత్తు రైలుకింద పడి మృతిచెందాడా, ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే విషయాలు తెలియరాలేదన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.
Read More »స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి
కామరెడ్డి, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పార్టీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు అన్నారు. మంగళవారం కామరెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహాక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన సురేందర్ తెరాసలో చేరినప్పటికి కార్యకర్తలు మాత్రం పార్టీ వీడకుండా క్రమశిక్షణతో కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారని చెప్పారు. జిల్లాలోని ఎంపిటిసి, జడ్పిటిసి అభ్యర్థులను గెలిపించి ...
Read More »అబద్దపు వీడియో నమ్మొద్దు
జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు నిజామాబాద్, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర బార్డర్లో ఇవిఎం దొరికినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అబద్దపు వీడియో నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినది కాదని జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అది రాజస్థాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినదని, పోలీసు విచారణలో గుర్తించినట్టు పేర్కొన్నారు. కాబట్టి ప్రజలు ఇలాంటి అబద్దపు వీడియోలు నమ్మవద్దని కోరారు. అబద్దపు ప్రచారం నిర్వహించే సంబంధిత వ్యక్తులపై పోలీసులు చట్టప్రకారం చర్యలు ...
Read More »రైతులు ఎవ్వరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు
ఆర్డివో రాజేశ్వర్‌రావు బీర్కూర్, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టాపాసు పుస్తకాలకోసం రైతులు ఎవ్వరికి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదని ఆర్డివో రాజేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూ ప్రక్షాళన కార్యక్రమంలో మిగిలిన అటవీ పరిధిలోని భూముల వివరాలను తెలుసుకున్నారు. రైతుల యొక్కభూములు అటవీ శాఖా పరిధిలో ఉంటే ఆర్వోఎఫ్ఆర్లను అతి త్వరలో అందిస్తామన్నారు. పలుచోట్ల అధికారులు పట్టా పాసుపుస్తకాల కోసం డబ్బులు అడుగుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయని, అటువంటి వారిపై ...
Read More »వడదెబ్బ తగలకుండా జాగ్రత్తపడాలి
బీర్కూర్, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రంలో మండల ఆరోగ్యశాఖ సూపర్వైజర్ మాలింబి ఆధ్వర్యంలో ఆరోగ్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని, కావున ప్రతి ఒక్కరు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దీంతోపాటు ఆటలమ్మ వచ్చినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అంతేకాకుండా చిన్న పిల్లలకు వేసవిలో కల్లు తాగిస్తారని, కల్లుకు దూరంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త వెంకటలక్ష్మి, అంగన్వాడి టీచర్ గంగామణి, గౌరమ్మ, ఆశా వర్కర్ ...
Read More »స్థానిక ఎన్నికల విధులపై శిక్షణ
బీర్కూర్, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ మండల ఎండివో కార్యాలయంలో మంగళవారం 11 గంటల నుండి ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల దృష్ట్యా పివో, ఏపివోలకు ఎన్నికల విధులపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల శిక్షణా అధికారి ఎండివో హరిషింగ్ నాయక్ మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే వారికి మాక్ పోలింగ్ అనేది ఉండదని, ప్రతి పోలింగ్ కేంద్రం 100 మీటర్లు ఒక లైన్, 200 మీటర్లకు ఒకలైన్ వేయించి కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి ...
Read More »పార్టీ అవకాశమిస్తే పోటీ చేస్తా
కాంగ్రెస్ పార్టీ యువనాయకుడు పజాపండరి నిజాంసాగర్, ఏప్రిల్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ నుంచి నిజాంసాగర్ జడ్పీటీసీ టికెట్ ఇస్తే తను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వడ్డేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ప్రజాపండరి తెలిపారు. గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో తనను గ్రామ ప్రజలు ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించారని ఒక విద్యావంతునిగా, యువకునిగా, జుక్కల్ నియోజకవర్గ ప్రాంత సమస్యలు తెలిసిన వాడిగా తనకు అవకాశం కల్పించాలని ఆయన పార్టీ పెద్దలను కోరారు. ఇక్కడి ప్రాంత ...
Read More »