Breaking News

రైతులు ఎవ్వరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు

ఆర్‌డివో రాజేశ్వర్‌రావు

బీర్కూర్‌, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టాపాసు పుస్తకాలకోసం రైతులు ఎవ్వరికి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదని ఆర్‌డివో రాజేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూ ప్రక్షాళన కార్యక్రమంలో మిగిలిన అటవీ పరిధిలోని భూముల వివరాలను తెలుసుకున్నారు.

రైతుల యొక్కభూములు అటవీ శాఖా పరిధిలో ఉంటే ఆర్‌వోఎఫ్‌ఆర్‌లను అతి త్వరలో అందిస్తామన్నారు. పలుచోట్ల అధికారులు పట్టా పాసుపుస్తకాల కోసం డబ్బులు అడుగుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయని, అటువంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Check Also

నిజామాబాద్‌కు పొంచి ఉన్న ప్రమాదం

నిజామాబాద్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిడతల‌ దండు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన నిజామాబాద్‌, నిర్మల్‌, ...

Comment on the article