Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

సమస్యల పరిష్కారానికి కమీషనర్‌ హామీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయం టంగుటూరి అంజయ్య భవన్‌ ముందు నిర్వహించిన నిరసన అనంతరం రాష్ట్ర కమిషనర్‌ ఎండి నదీమ్‌ ఐక్య బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన వినతి పత్రంపై కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రభాకర్‌, గౌరవ అధ్యక్షులు సిహెచ్‌ తిరుపతి, ప్రధాన కార్యదర్శి అంతంపల్లి రమేష్‌, సహాయ కార్యదర్శి రాజలింగం మాట్లాడారు.

భవన నిర్మాణ కార్మికులకు చెందిన గుర్తింపు కార్డుల రెన్యువల్‌ మూడు నెలల నిబంధన పరిచేందుకు అన్ని జిల్లాల డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా కాకుండా మిగిలిపోయిన ఆరులక్షల కార్డులను రెన్యువల్‌ చేయించేందుకు ఐక్య బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కషి చేయాలని తెలిపారు. దీనితో పాటు ఫిబ్రవరి 15న ప్రధానమంత్రి ప్రకటించిన సమయోజనీయ పెన్షన్‌ స్కీమ్‌ నిర్మాణ రంగ కార్మికులకు సంబంధం లేదని వారు నెలవారి కట్టే డబ్బులు కట్టుకొని అవసరం లేదని ఈ విషయాన్ని కార్మికులకు తెలియజేయంని తెలిపారు.

తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు కార్డులు పొందని కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డ్‌లో చేర్పించేందుకు ప్రత్యేక క్యాంపెయిన్‌ చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకోసం వెల్ఫేర్‌ బోర్డ్‌ రాష్ట్ర కమిటీ చర్యలు చేపట్టిందని తెలిపారు. కార్మికులకు సంబంధించిన సమస్యలు ఏవైనా స్థానిక అధికారులు పరిష్కారం చేస్తున్నారని ఒకవేళ ఏ జిల్లా అధికారి అయిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమ దష్టికి తీసుకురావాలని వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.

కార్మిక సమస్యలపై వినతి పత్రం ఇచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరించేందుకు సానుకూలత వ్యక్తం చేస్తూ పరిష్కారానికి హామీ ఇచ్చిన కార్మిక శాఖ కమిషనర్‌కు కామారెడ్డి జిల్లా ఐక్య బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏఐసిటియు ధన్యవాదాలు తెలియజేస్తోందని తెలిపారు. కార్మికుల సమస్యలు అధికారులతో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకొమ్మని కమిషనర్‌ ఇచ్చిన సూచన ప్రకారం కార్మిక సంక్షేమానికి పోరాటాలు నిర్వహించే సంఘంగా కార్మికులకు న్యాయం కోసం మరింత ముందుకు వెళ్దామని తెలిపారు.

Check Also

లయన్స్‌ క్లబ్‌ ఆద్వర్యంలో దుప్పట్ల పంపిణీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో శుక్రవారం రాత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *