Breaking News

స్ట్రాంగ్‌ రూంల పరిశీలనకు అభ్యర్థులను అనుమతిస్తాం

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలనకు అభ్యర్థులను లేదా అధికారికంగా నియమించబడిన ఏజెంట్‌ను నిబంధనల మేరకు అనుమతించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు లేదా వారి నుండి అధికారికంగా అనుమతి పొందిన ఎన్నికల ఏజెంట్లను ఈవీఎంలు భద్రపరచిన గదులను సి.సి.కెమెరాల రికార్డింగ్‌ ఉన్నంతవరకు పరిశీలించడానికి ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు అనుమతించడం జరుగుతుందని చెప్పారు.

ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్‌ రూంలకు తాళం, సీల్‌ వేసిన 12వ తేదీన హాజరైన అందరు అభ్యర్థులను వారి ఏజెంట్లను అనుమతించడం జరిగిందని, అదేవిధంగా 15వ తేదీన మధ్యాహ్నం 10 నిమిషాలపాటు బిజెపి తరఫున ఆ పార్టీ ప్రతినిధి బస్వ లక్ష్మీ నరసయ్యను, 16వ తేదీన సుమారు 15 నిమిషాలపాటు బిజెపి అభ్యర్థిని పరిశీలించడానికి అనుమతించడం జరిగిందని వివరించారు. ఇ.సి.ఐ.నియమ నిబంధనల ప్రకారం అనుమతించడం జరుగుతుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

Check Also

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో డాక్టర్స్‌ డే

నిజామాబాద్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం ఆద్వర్యంలో బుదవారం డాక్టర్స్‌ ...

Comment on the article