నిజామాబాద్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో మరింత మెరుగైన ర్యాంకులు సాధించినందుకు జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అభినందించారు. గురువారం ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం ఫలితాలలో ద్వితీయ సంవత్సరం ఫలితాలలో జిల్లా ఎనిమిదవ ర్యాంకు సాధించగా ఈ సంవత్సరం ఏడవ ర్యాంకుతో మరింత ముందు వరుసలో నిలిచిందన్నారు. అదే విధంగా గత సంవత్సరం ప్రథమ సంవత్సరం పరీక్షలలో తొమ్మిదవ ర్యాంకును ఈ సంవత్సరం కూడా నిలపెట్టుకోవడంపై ...
Read More »Daily Archives: April 18, 2019
శుక్రవారం హనుమాన్ జయంతి ఉత్సవాలు
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం దేవునిపల్లి శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం 7 గంటల నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు గ్రామాభివృద్ది కమిటీ అధ్యక్షుడు నిట్టు నారాయణరావు తెలిపారు. ఉదయం స్వామివారికి సిందూర పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, రాత్రి వరకు ప్రత్యేక పూజలు ఉంటాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. భజరంగ్‌దళ్ ఆద్వర్యంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం భారీ బైక్‌ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రతినిధులు తెలిపారు. కోడూరి హనుమాన్ ఆలయం ...
Read More »యువకుని రక్తదానం
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి అత్యవసరంగా రక్తం అవసరం కాగా గురువారం సాయిలు అనే యువకుడు రక్తదానం చేశాడు. రోగి తరఫు బందువులు రక్తదాతల సమూహాన్ని ఆశ్రయించగా సాయిలు వి.వి.ఠాకూర్ బ్లడ్‌బ్యాంకులో రక్తదానం చేసి ఆపదలో ఉన్న మహిళను ఆదుకున్నాడు.
Read More »ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపు
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపు బల్దియాకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లిస్తే వినియోగదారులకు రిబేటు ఇస్తుండడంతో వినియోగదారులు ముందస్తుగా పన్నులు చెల్లిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం.జి.వేణుగోపాల్‌గౌడ్ తన కౌండిన్య కాంప్లెక్సుకు సంబంధించిన 2019-20 సంబంధించి ముందస్తు ఆస్తిపన్ను కింద రూ. 2 లక్షల 36 వేల 760 లు గురువారం మునిసిపల్ కమీషనర్‌కు అందజేశారు. ముందస్తు పన్ను చెల్లింపుతో ఆస్తిపన్నుల వసూలులో సిబ్బంది లక్ష్యాన్ని చేరుకుంటున్నారని, పన్ను వసూలు ద్వారా బల్దియా ...
Read More »ఎలక్షన్ కమీషన్ సమావేశానికి హాజరైన కలెక్టర్, ఎస్పి
కామారెడ్డి, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ముఖ్య అధికారుల సమావేశానికి జిల్లా కలెక్టర్ సత్యనారాయణతోపాటు జిల్లా ఎస్పి శ్వేతారెడ్డిలు హాజరయ్యారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు, పంచాయతీరాజ్ చట్టం అమలుతీరు, తదితర చర్యలపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ సమావేశం నిర్వహించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు, సిపిలు, సిఇవోలు, ప్రత్యేక అధికారులతో సమావేశమై రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై మాట్లాడారు. అదికారులకు ...
Read More »సూచించిన తేదీల్లో స్ట్రాంగ్‌రూంలు విజిట్ చేయొచ్చు
జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు నిజామాబాద్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈవీఎంలు భద్రపరిచిన సీలు పరిశీలించుకోవడానికి అభ్యర్థులకు అవకాశం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగిందని స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలించుకోవడానికి మొదటి విజిట్ ఈనెల 23న, రెండవ విజిట్ మే 2న, మూడవ విజిట్ మే 14న ఉదయం 11 గంటలకు చూసుకోవచ్చని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలో బాల్కొండ, ...
Read More »కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలి
జిల్లా సంయుక్త కలెక్టర్ యాదిరెడ్డి బీర్కూర్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల మద్దతు ధర కొరకు ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల నుండి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా మండల పిఎసిఎస్ అధికారులు, సొసైటీ చైర్మన్లు జాగ్రత్త వహించాలని గురువారం జిల్లా సంయుక్త సహాయ అధికారి యాదిరెడ్డి అన్నారు. తూకం వేసిన 24 గంటల లోపు వరి ధాన్యమును తరలించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. వరి ధాన్యపు బస్తాలను లారీలలో త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ ...
Read More »