కామారెడ్డి, ఏప్రిల్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లో నిర్వహించిన ముఖ్య అధికారుల సమావేశానికి జిల్లా కలెక్టర్ సత్యనారాయణతోపాటు జిల్లా ఎస్పి శ్వేతారెడ్డిలు హాజరయ్యారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు, పంచాయతీరాజ్ చట్టం అమలుతీరు, తదితర చర్యలపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ సమావేశం నిర్వహించింది.
జిల్లా కలెక్టర్లు, ఎస్పిలు, సిపిలు, సిఇవోలు, ప్రత్యేక అధికారులతో సమావేశమై రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై మాట్లాడారు. అదికారులకు దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ ఎస్.కె.జోషి. ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- గుడిలో ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా…? - February 25, 2021
- వన్నెల్ (బి)లో పోలీసు కళాజాత - February 25, 2021
- 26లోగా పూర్తి చేయాలి - February 24, 2021