Breaking News

కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు తలెత్తకుండా చూడాలి

జిల్లా సంయుక్త కలెక్టర్‌ యాదిరెడ్డి

బీర్కూర్‌, ఏప్రిల్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల మద్దతు ధర కొరకు ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల నుండి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా మండల పిఎసిఎస్‌ అధికారులు, సొసైటీ చైర్మన్‌లు జాగ్రత్త వహించాలని గురువారం జిల్లా సంయుక్త సహాయ అధికారి యాదిరెడ్డి అన్నారు. తూకం వేసిన 24 గంటల లోపు వరి ధాన్యమును తరలించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

వరి ధాన్యపు బస్తాలను లారీలలో త్వరితగతిన రైస్‌ మిల్లులకు తరలించాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రం నుండి గురువారం వరకు 22,850 వరి ధాన్యపు బస్తాలను రైస్‌ మిల్లులకు తరలించడం జరిగిందని పేర్కొన్నారు. రైతులను మోసపరచకుండ తూకం విధానం సరిగ్గా ఉండే విధంగా హమాలీలు చూసుకోవాలన్నారు. దీనితో పాటు రైతులు వరి ధాన్యము పోసుకోవడానికి సొసైటీ నుండి బరుకలను, చేన్నిలను, త్రాగునీటి సౌకర్యమును తప్పనిసరిగ అందించాలన్నారు.

మండలంలో కిష్టాపూర్‌ గ్రామం నుండి 7,657 వరి ధాన్యపు బస్తాలను 46 మంది రైతుల నుండి, బీర్కూర్‌ నుండి 9005 వరి ధాన్యము బస్తాలు 42 మంది రైతుల నుండి సేకరించడం జరిగిందన్నారు. దీనితో పాటు బరంగెడ్గి గ్రామం నుండి ఆరువేల 224 బస్తాలను 22 మంది రైతుల నుండి సేకరించి రైస్‌ మిల్లులకు అందజేయడం జరిగిందన్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభమైన నాటి నుండి 273 భారదను తీసుకురావడం జరిగిందని తెలిపారు. దీనితో పాటు 17 వరి ధాన్యపు తేమ శాతం తీయడం జరుగుతుందన్నారు. ఆయన వెంట తహసిల్దార్‌ బాల శంకర్‌, డిిఎం ఇర్ఫాన్‌, డిసిఓ మమత, ఎన్‌ఫోర్సుమెంటు అధికారిణి బాలలక్ష్మి, రైతులు ఉన్నారు.

Check Also

పరీక్ష కేంద్రం తనిఖీ

భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలల్లో ...

Comment on the article