Breaking News

సూచించిన తేదీల్లో స్ట్రాంగ్‌రూంలు విజిట్‌ చేయొచ్చు

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈవీఎంలు భద్రపరిచిన సీలు పరిశీలించుకోవడానికి అభ్యర్థులకు అవకాశం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇవ్వడం జరిగిందని స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించుకోవడానికి మొదటి విజిట్‌ ఈనెల 23న, రెండవ విజిట్‌ మే 2న, మూడవ విజిట్‌ మే 14న ఉదయం 11 గంటలకు చూసుకోవచ్చని కలెక్టర్‌ ప్రకటనలో తెలిపారు.

నిజామాబాద్‌ పార్లమెంటు స్థానం పరిధిలో బాల్కొండ, ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటింగ్‌ నిర్వహించిన ఈవీఎంలను డిచ్‌పల్లి మండలం సుద్ధపల్లి గ్రామంలోని క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాలలో భద్రపరచడం జరిగిందన్నారు. వీటిని అభ్యర్థులు సాధారణ పరిశీలకుల సమక్షంలో సీల్‌ చేయడం జరిగిందన్నారు. ఈవిఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌రూమ్‌, వాటికి వేసిన తాళాలను, సీళ్లను అభ్యర్థులు పరిశీలించు కోవాలనుకుంటే సూచించిన తేదీలలో అభ్యర్థులు కానీ అనుమతించిన వారి అధికారిక ఏజెంట్లు కానీ వారికి జారీచేసిన గుర్తింపు కార్డులను చూపించి లోనికి వెళ్లడానికి అవకాశం ఉందన్నారు.

సెల్‌ఫోన్‌లు లోపలికి అనుమతించడం ఉండదన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌లకు వేసిన తాళాలను, సీళ్లను బయట ఉండే సెక్యూరిటీ సిబ్బంది దగ్గర కూడా టీవీలో చూడవచ్చు అన్నారు. అదేవిధంగా సీఎంసి కళాశాలలో ఈవీఎంలను మూడంచెల భద్రతలో ఉంచడం జరిగిందని తెలిపారు. మొదటి భద్రత స్ట్రాంగ్‌ రూమ్‌ లవద్ద సిఏపిఎఫ్‌ ఆర్మ్డు ఫోర్సు, రెండవ భద్రత స్టేట్‌ ఫోర్సు, మూడవ భద్రత డిస్ట్రిక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫోర్సు ఉంటుందన్నారు. ఇవిఎంలకు ఎన్నికల నిబంధనలను అనుసరించి గట్టి భద్రతను ఏర్పాటు చేశామని ప్రజలు కానీ అభ్యర్థులు కానీ ఈ విషయంలో ఎటువంటి పుకార్లను నమ్మవద్దని కలెక్టర్‌ ప్రకటనలో కోరారు. అబద్ధపు వార్తలను వ్యాప్తి చేసే వారిపై పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని కలెక్టర్‌ ప్రకటనలో తెలిపారు.

Check Also

18న ఒక బార్‌కు మాత్రమే డ్రా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా యందు 12 కొత్త బార్లకు నోటిఫికేషన్‌ ...

Comment on the article