మోర్తాడ్, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మండలంలోని ఆయా గ్రామాల్లోని హనుమాన్ ఆలయాల్లో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి సిందూరపూజలు, అభిషేకాలు, అర్చనలు, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. హనుమాన్ ఆలయాల వద్ద పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయాల వద్ద భక్తుల సౌకర్యార్థం షామియానాలు, తాగునీరు, అన్నదానం ఏర్పాటుచేశారు. పలు గ్రామాల్లో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. యువకులు కేరింతలు కొడుతూ ...
Read More »Daily Archives: April 19, 2019
సృజన సంగమం పుస్తకావిష్కరణ
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి ఆద్వర్యంలో శుక్రవారం ఎన్నీల ముచ్చట్లు ఏడాది పండుగ నిర్వహించారు. స్థానిక కర్షక్ బిఇడి కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండి మల్లారెడ్డి విచ్చేసి సృజన సంగమం పుస్తకావిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేడు అక్షరాలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఖండించాలన్నారు. ప్రశ్నించడం నేరం కాదని, కవులు, రచయితలు తమ బాధ్యతను విస్మరించరాదన్నారు. కామరెడ్డిలో ఎన్నిల ముచ్చట్లు ప్రారంభమై ఎంతోమంది యువకవులను తయారుచేసిందన్నారు. జిల్లా అధ్యక్షుడు ...
Read More »ఎన్నికల్లో లబ్దికోసమే రైతుబంధు
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల్లో లబ్దికోసమే కెసిఆర్ రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కోదండరెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఛైర్మన్ అన్వేష్‌రెడ్డిలు విమర్శించారు. శుక్రవారం వారు కామరెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ 2018లో తెరాస ప్రభుత్వం జీవో నెంబర్ 231 తీసుకొచ్చి రైతుబంధు పథకం తెచ్చారన్నారు. ముందస్తు ఎన్నికల సందర్భంగా పథకాన్ని తీసుకొచ్చి రైతులను, ప్రజలను ...
Read More »రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్టు కామరెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన లింగంపేట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కస్టించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరనిస్తు కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకొని వారికి డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. కామరెడ్డి జిల్లా వ్యాప్తంగా 205 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ...
Read More »ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరేదెప్పుడూ…
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిజెపి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు నెరవేరేదెప్పుడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యురాలు పశ్యపద్మ ప్రశ్నించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బిజెపి అధికారంలోకి వచ్చిన నాటినుంచి దళితులపై, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయని, ప్రశ్నించిన వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఒక్క యుపిలోనే ఆరెస్సెస్, బిజెపి 1037 దళిత, మైనార్టీలపై వివిధ అఘాయిత్యాలు చేశారని ఆరోపించారు. మతప్రచారంతో బిజెపి అధికారంలోకి ...
Read More »తెరాసలో పలువురి చేరిక
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ సమక్షంలో శుక్రవారం పలువురు తెరాసలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొన్నాల లక్ష్మారెడ్డి తనయుడు శ్రీకాంత్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు తెరాస తీర్థం పుచ్చుకున్నారు. మాచారెడ్డి ఎంపిపి నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో యువకులు తెరాస పార్టీలో చేరారు. వీరిని ఎమ్మెల్యే కండువాలతో పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్పర్సన్ పిప్పిరి సుష్మ, డిసిఎంఎస్ ఛైర్మన్ ముజీబుద్దీన్, మాచారెడ్డి మండల తెరాస కార్యదర్శి అంజినాయక్, నాయకులు గోపాల్‌రెడ్డి, రాంరెడ్డి, కమలాకర్‌రెడ్డి ...
Read More »భక్తులకు మజ్జిగ పంపిణీ
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో యువకులు మజ్జిగ పంపిణీ చేశారు. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు, శోభాయాత్రలో పాల్గొన్నవారికి ఉచితంగా మజ్జిగ అందజేశారు.
Read More »కన్నుల పండువగా హనుమాన్ శోభాయాత్ర
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామరెడ్డి పట్టణంలో శుక్రవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది. హిందువులు శోభాయాత్రలో వేలాది సంఖ్యలో పాల్గొన్నారు. హనుమాన్ విగ్రహాన్ని లారీపై ఉంచి డిజె శబ్దాల మధ్య నృత్యాలు చేస్తు పట్టణంలోని వీధుల్లో ఊరేగించారు. కాషాయ జెండాలతో నగరమంతా కాషాయమయమైంది. వీదులన్ని హనుమాన్ నామ స్మరణతో హోరెత్తాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వివిధ ఆలయాల్లో హనుమంతునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాలు భక్తుల ...
Read More »శుక్రవారం హనుమాన్ విజయోత్సవం
చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెప్తారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని పరాశర మహర్షి చెప్పారు. శ్రీ రాముడి సీతామాతతో కలిసి అయోధ్యను చేరుకున్నాక, లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమయేనని రాముడు ప్రకటించి, చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట. అదేగాక ఇంకో కధనం కూడా ఉంది. చైత్రపూర్ణిమ నాడు ఆంజనేయస్వామి వారి అసురసంహారం చేయడం మూలంగా దీన్ని ఘనంగా, హనుమాన్ విజయోత్సవంగా జరుపుతారట. ఈ చైత్ర పూర్ణిమ నుంచి వైశాఖ ...
Read More »ఆంజనేయుడు జన్మించిన ప్రదేశం ఎక్కడ?
ఆంజనేయుడిని భజరంగబలి, మారుతి, అంజనిసుతుడు, హనుమంతుడు అని అనేక పేర్లతో కొలుస్తుంటారు. అయితే అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. ఇంకా అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, కేసరీనందనుడు అని పిలుస్తారు. మరి హనుమంతుడు జన్మించిన ప్రదేశం ఎక్కడ? ఆ పుణ్యస్థలం గురించి మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుడు జన్మించిన స్థలం పైన అనేక భిన్నాభిప్రాయాలు ఉండగా, మహారాష్ట్రలోని నాసిక్ అనే ప్రదేశంలోని అంజనేరి అనే కొండ ఉన్న ప్రదేశంలో ...
Read More »