Breaking News

ఒంట్లో రక్తం పెరగాలంటే

అనీమియా చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. అనీమియాను అధిగమించం చాలా ఈజీ అంటున్నారు వైద్య నిపుణులు. ఇంట్లో ఉన్న వస్తువులతో అనీమియా నుంచి బయటపడవచ్చు అంటున్నారు. అంతేకాదు రక్తం పెరగడానికి చాలా సులువైన మార్గాలు వున్నాయంటున్నారు. ఒక ఆపిల్‌, ఒక టమోటా కలిపి జ్యూస్‌గా చేసుకుని తాగాలి. అలాగే బెల్లంను టీ, కాఫీలలో కలుపుకుని తాగాలి. అలాగే డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవాలి.

అంజీర పండు కూడా బాగా ఉపయోపడుతుంది. అంజీరలో ఐరన్‌, మినరల్స్‌ హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. ఖర్జూరా పండు రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. డైలీ డైట్లో ఖర్జూరా పండును యాడ్‌ చేసుకోవాలి. అరటిపండులో ఐరన్‌, మెగ్నీషియం ఉంటాయి. బీట్రూట్‌ ముక్కలుగా చేసుకుని జ్యూస్‌ చేసుకుని తాగాలి. పాలకూర, కొత్తిమీర,పుదీనా రక్తాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి కనుక వాటిని కూడా తీసుకుంటుండాలి.

Check Also

ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *