నిజాంసాగర్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని జక్కాపూర్ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం విరాళం స్వీకరించారు. స్వీకరించిన విరాళం 20 వేల రూపాయలను ఎస్ఐ సాయన్న ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ బంజా కంసవ్వ బసప్ప సీసీ కెమెరాలు ఏర్పాటుచేసే నిర్వాహకునికి అందజేశారు. వారి వెంట గ్రామస్తులు ఉన్నారు.
Read More »Daily Archives: April 21, 2019
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలి
కలెక్టర్ రామ్మోహన్రావు నిజామాబాద్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. ఆదివారం ఎంపీడీవో ఆర్ఒ ఈఓపిఆర్డి లతో వీడియో కాన్పరెన్సు ద్వారా మాట్లాడారు. 22 ఏప్రిల్ 2019 సోమవారం నుండి నిజామాబాద్ డివిజన్లో జడ్పిటిసి, ఎంపిటిసి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని 24 ఏప్రిల్ 2019 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, మే 6వ తేదీన పోలింగ్ నిర్వహించాలని అందుకోసం అధికారులు ఏలాంటి లోటు పాట్లు ...
Read More »దిష్టిబొమ్మ దగ్దం
కామారెడ్డి, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల ఇంటర్ బోర్డు విడుదలచేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, అయినా పట్టించుకోవడం లేదని కామారెడ్డి ఏబివిపి నాయకులు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాలలో అవకతవకలకు పూర్తి బాధ్యత వహిస్తూ బోర్డు కార్యదర్శి అశోక్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబివిపి విద్యార్థి నాయకులు ఉన్నారు.
Read More »ఎన్నికల విధుల్లో పక్షపాతం చూపొద్దు
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు నిజామాబాద్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల విధులలో ఎలాంటి పక్షపాతం చూపించకూడదని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. ఆదివారం నిజామాబాద్ ఏం.పి.డి ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న వారు తప్పనిసరిగా సమయ పాలన ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. ఈ నెల 22 నుడి 24 వరకు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ ...
Read More »