Breaking News

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలి

కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ఆదివారం ఎంపీడీవో ఆర్‌ఒ ఈఓపిఆర్‌డి లతో వీడియో కాన్పరెన్సు ద్వారా మాట్లాడారు. 22 ఏప్రిల్‌ 2019 సోమవారం నుండి నిజామాబాద్‌ డివిజన్లో జడ్పిటిసి, ఎంపిటిసి నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని 24 ఏప్రిల్‌ 2019 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, మే 6వ తేదీన పోలింగ్‌ నిర్వహించాలని అందుకోసం అధికారులు ఏలాంటి లోటు పాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

మొదటి విడత నిజామాబాద్‌ డివిజన్లోని 8 జెడ్పిటిసిలకు 100 ఎంపిటిసిలకు 22 ఏప్రిల్‌ 2019 ఇది ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తానని తెలిపారు. నామినేషన్‌ ఆన్‌లైన్‌ ద్వారా చేయాలని అని తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా చేసినవారు నామినేషన్‌ హార్డ్‌ కాపీ సంభందిత రిటర్నింగ్‌ అధికారికి ఇవ్వాలన్నారు. మొత్తం 2 లక్షల 60 వేల 411 మంది ఓటర్లు నిజామాబాద్‌ డివిజన్లో మొదటి విడత తమ ఓటుహక్కును వినియోగించుకో నున్నారని తెలిపారు. ఈ నెల 28న నామినేషన్‌ ఉపసంహరణ. అలాగే 25 న నామినేషన్ల పరిశీలన ఎన్నికల ప్రక్రియ అందరికి తెలిసే విధంగా నోటీసులు బోర్డులు ఏర్పాటు చేయాలని తహసిల్దార్‌ కార్యాలయంలో ఎంపిడిఓ కార్యాలయం గ్రామపంచాయతీ కార్యాలయంలో పబ్లిక్‌ స్థలాల్లో కూడలిలో ఏర్పాటు చేయాలని తెలిపారు.

వచ్చిన నామినేషన్లను వెంటనే స్కానింగ్‌ ఆన్‌లైన్‌ అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ రిసెప్షన్‌ సెంటర్‌ స్ట్రాంగ్‌ రూమ్‌ కూడా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రెండో విడత రెండు లక్షల 203 మంది తమ ఓటును వినియోగించుకుంటారని 8 జడ్పిటిసి 75 ఎంపిటిసిలకు మూడో విడత 11 జడ్పీటీసీలు, 124 ఎంపీటీసీలకు ఎన్నికలు జరుగనున్నందున అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మూడో విడతలో 3 లక్షల 18 వేల 447 మంది ఓటు హక్కు వినియోగించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, మొత్తం 27 జడ్పీటీసీలు 299 ఏం.పి.టి.సి స్థానాలు కాగా మొదటి దశలో నిజామాబాద్‌ డిచ్‌ పల్లి, ధర్పల్లి, మాక్లుర్‌ ఇందల్వాయి, ముగ్‌పాల్‌, నవిపెట్‌, సిరికొండ మండల్లాలో, మొదటి విడత పోలింగ్‌ మే 6వ తేదీన ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వేణు, డిప్యూటీ సిఈఓ గోవిందు, డి.పి.ఓ జయసుధ తదితరులు పాల్గొన్నారు.

Check Also

40 వేల సభ్యత్వం పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *