Breaking News
మాట్లాడుతున్న కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

ఎన్నికల విధుల్లో పక్షపాతం చూపొద్దు

నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల విధులలో ఎలాంటి పక్షపాతం చూపించకూడదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ఆదివారం నిజామాబాద్‌ ఏం.పి.డి ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న వారు తప్పనిసరిగా సమయ పాలన ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. ఈ నెల 22 నుడి 24 వరకు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌ స్వీకరణ ఉంటుందని తెలిపారు.

నామినేషన్ల కోసం ఎక్కువగా వచ్చిన పక్షంలో 5 గంటలలోపు వచ్చిన వారిని టోకెన్‌ ఇచ్చి నామినేషన్లు స్వీకరించాలని తెలిపారు. నామినేషన్‌ వేసిన పార్టీల అభ్యర్థులు బి ఫామ్‌ 28 ఏప్రిల్‌ 2019 వరకు3 గంటల వరకు ఇవ్వాలన్నారు. అలాట్మెంట్‌ ఆఫ్‌ సింబల్‌ నేషనల్‌ పార్టీస్‌ రిజిస్టర్‌ సింబల్‌ అలాట్మెంట్‌ అయిన పార్టీలు, రిజిస్టర్‌ అయి సింబల్‌ అలాట్మెంట్‌ కాని పార్టీలు తర్వాత స్వతంత్రులకు తెలుగు వర్ణమాల ప్రకారం అలాట్మెంట్‌ చేయాలని తెలిపారు. ఈ విధంగా నాలుగు కేటగిరీలు లో సింబల్‌ కేటాయింపు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఓ సంజీవ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రాజ్యాంగానికి అనుగుణంగా జీవనం సాగించాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం లింగంపేట్‌లో జరిగిన సమావేశంలో సర్పంచ్‌కు కాంస్టిట్యూషన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *