శుభకార్యానికి వెళ్తూ మృత్యుఒడిలోకి కామారెడ్డి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామరెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బలయ్యారు. మరో రెండు నిమిషాల్లో వారు చేరుకోవాల్సిన వివాహ శుభకార్యానికి హాజరయ్యేంతలోపే దారుణం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యూ టర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న కారు వీరిని ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మృతులను మెదక్ జిల్లాకు ...
Read More »Daily Archives: April 22, 2019
తెరాసలో చేరిన యువకులు
కామారెడ్డి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామానికి చెందిన పలువురు యువకులు, గ్రామస్తులు సోమవారం కామారెడ్డిఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో తెరాసలో చేరారు. రాష్ట్రంలో కెసిఆర్ చేపడుతున్న అభివృద్ది పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్టు తెలిపారు. వారిని కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.
Read More »ప్రజావాణిలో 29 ఫిర్యాదులు
కామారెడ్డి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జనహితలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ శాఖలకు సంబంధించి 29 పిర్యాదులు అందినట్టు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. రెవెన్యూ-17, ఎక్సైజ్-1, డిపివో-3, ఇండస్ట్రీస్-1, ఆరోగ్యశాఖ-2, విద్యాశాఖ-1, నిరుద్యోగ శాఖ-1 ఫిర్యాదులు అందాయన్నారు. సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
Read More »వడదెబ్బతో బాలుని మృతి
కామారెడ్డి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భవానిరోడ్డుకు చెందిన కుంట కార్తిక్ (12) సోమవారం వడదెబ్బతో మృతి చెందినట్టు వార్డు ప్రజలు తెలిపారు. ఎండలో ఆడుకుంటుండగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్టు వైద్యులు చెప్పారని పేర్కొన్నారు.
Read More »రైతు సమగ్ర సమాచార సేకరణ పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో రైతు సమగ్ర సమాచార సేకరణ పకడ్బందీగా పక్కాగా నిర్వహించాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. సోమవారం ఆయన వీడియో కాన్పరెన్సు ద్వారా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 2 లక్షల 31 వేల 617 కాగా, ఇప్పటి వరకు సర్వేచేసిన రైతుల సంఖ్య 74 వేల 238 పూర్తయిందన్నారు. వ్యవసాయాధికారులను ఎన్నికల విధుల్లో వినియోగించుకోవద్దని, మిగతా సర్వే రెండ్రోజుల్లో పూర్తిచేయాలని, ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారం పంపాలని ఆదేశించారు. ...
Read More »తెరాస గ్రామ అధ్యక్షుడు కాంగ్రెస్‌లో చేరిక
కామారెడ్డి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట మండలం యాడారం గ్రామ తెరాస అధ్యక్షుడు లక్కరాసు రవి సోమవారం తెరాస పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. భూమాగౌడ్, శ్రవణ్‌కుమార్, బాల్‌రెడ్డిల ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి షబ్బీర్ అలీ ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, నాయకులు పాల్గొన్నారు.
Read More »కార్మికుల సంక్షేమ పథకాల అమలు కోసం ఆందోళన
కామారెడ్డి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్మికుల సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయించేందుకు, కార్మికశాఖ అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళనకు సిద్దం కావాలని ఏఐసిటియు జిల్లా అధ్యక్షుడు కల్లూరి ప్రభాకర్, గౌరవ అధ్యక్షుడు తిరుపతి పిలుపునిచ్చారు. సోమవారం కామరెడ్డిలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కార్మికుల ఐక్యత పునరంకిత దినోత్సవంగా మేడేను జరపాలన్నారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు పథకాల అమలుకు ఉద్యమం తప్పదని పేర్కొన్నారు. సమావేశంలో యూనియన్ నాయకులు సురేశ్, ఖలీల్, సంపత్, సత్తార్, ప్రకాశ్, నాగయ్య, పోచయ్య, ...
Read More »పబ్జీ గేమ్ నిషేదించాలి
ఆర్మూర్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో మచ్చర్ల గ్రామంలో పబ్జీ గేమ్‌ను ఆడకండి ప్రాణాలను బలిపెట్టవద్దని-పబ్జీ గేమ్‌ను నిషేధించాలని సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఏఐకెఎంఎస్ రాష్ట్ర నాయకులు దేవారాం, పివైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్ మాట్లాడుతూ పబ్జీ గేమ్ కారణంగా యువత గేమ్‌కు బానిసలై పదుల సంఖ్యలో తమ ప్రాణాలను ఇప్పటికే కోల్పోయారని అనేక మంది మానసిక రోగులుగా తయారవుతున్నారని అన్నారు. కావున పబ్జీ గేమ్‌ను ఆడవద్దని, ప్రభుత్వం పబ్జీ గేమ్‌ను నిషేధించాలని ...
Read More »జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు సర్వసన్నద్దం
నిజామాబాద్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో జెడ్పిటిసి, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల ఏర్పాట్లపై మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున జిల్లాలో మూడు విడతలుగా డివిజన్ వారిగా జరగనున్నాయని జిల్లాలో 27 జెడ్పిటిసిలకు, 299 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు సమర్ధవంతమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఏడు ...
Read More »మీడియా సహకారం భేష్
నిజామాబాద్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో అసెంబ్లీ, గ్రామపంచాయతీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీడియా సహకరించడం వలన ఎన్నికల సమాచారం ఎప్పటి కప్పుడు ప్రజలకు చేరవేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించినందున జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు అన్నారు. ఓటర్ల అవగాహనతో పాటు నమోదు పక్రియలో కూడా మీడియా ప్రక్యేక శ్రద్దపెట్టినందున పెద్ద మొత్తంలో జిల్లాలో ఎక్కువ మంది ఓటరు నమోదు చేశారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమ వంతు కషి ...
Read More »పార్టీ కోసం కష్టపడ్డవారికి గుర్తింపు ఉంటుంది
బీర్కూర్, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని మాజీ జడ్పీటీసీ ద్రోణావల్లి సతీష్ కార్యకర్తలనుద్దేశించి అన్నారు. సోమవారం బీర్కూర్‌లో తెరాస పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడతలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎన్నుకుందామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పకుండా తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. బీర్కూర్ మండలంలోని అన్ని ఎంపీటీసీలను అదేవిధంగా జడ్పీటీసీని భారీ మెజారిటీతో ...
Read More »