Breaking News
వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

రైతు సమగ్ర సమాచార సేకరణ పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రైతు సమగ్ర సమాచార సేకరణ పకడ్బందీగా పక్కాగా నిర్వహించాలని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. సోమవారం ఆయన వీడియో కాన్పరెన్సు ద్వారా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 2 లక్షల 31 వేల 617 కాగా, ఇప్పటి వరకు సర్వేచేసిన రైతుల సంఖ్య 74 వేల 238 పూర్తయిందన్నారు.

వ్యవసాయాధికారులను ఎన్నికల విధుల్లో వినియోగించుకోవద్దని, మిగతా సర్వే రెండ్రోజుల్లో పూర్తిచేయాలని, ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారం పంపాలని ఆదేశించారు. దీనికి మండల వ్యవసాయాధికారులు, ఏడిఏలను పూర్తి బాధ్యులను చేయాలని పేర్కొన్నారు.

Check Also

ప్రాజెక్టుపై ప్రయాణమా.. భద్రం… ఎక్కడా…?

నిజాంసాగర్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు కట్టపై గల మూల మలుపుల వద్ద ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *