Breaking News

ముగ్గురిని బలిగొన్న రోడ్డు ప్రమాదం….

శుభకార్యానికి వెళ్తూ మృత్యుఒడిలోకి

కామారెడ్డి, ఏప్రిల్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్‌ గ్రామ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బలయ్యారు. మరో రెండు నిమిషాల్లో వారు చేరుకోవాల్సిన వివాహ శుభకార్యానికి హాజరయ్యేంతలోపే దారుణం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యూ టర్న్‌ తీసుకుంటుండగా హైదరాబాద్‌ వైపు వేగంగా వెళ్తున్న కారు వీరిని ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు.

మృతులను మెదక్‌ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. మెదక్‌జిల్లా కౌడిపల్లి మండల కేంద్రానికి చెందిన చాకలి చంద్రయ్య (48), సురేశ్‌ (36), శివయ్య (38) బస్వాపూర్‌ గ్రామంలో వివాహానికి హాజరయ్యేందుకు బైక్‌పై బయల్దేరారు. బస్వాపూర్‌ గ్రామంలోని జైకా హోటల్‌ వద్ద యుటర్న్‌ తీసుకుంటుండగా బోధన్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కారు వేగంగా బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న చంద్రయ్య, సురేశ్‌, శివయ్య చాలా ఎత్తుకు ఎగిరి కిందపడి మృతి చెందారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మూడు కుటుంబాల పెద్దలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Check Also

అంబులెన్సులో సుఖ ప్రసవం

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ, పల్లెగడ్డ తండాకి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *