సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

విజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు అభివృద్ది చెందాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాస్త్రవేత్తలు అందించిన విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని రైతులు మొక్కవోని ధైర్యంతో వ్యవసాయాన్ని అభివృద్ది పథంలో నడిపించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. వ్యవసాయశాఖ, రాష్ట్ర ప్రభుత్వం, కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్‌ సంయుక్తంగా నిర్వహించిన కిసాన్‌మేళ, రైతు సదస్సు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రైతులనుద్దేశించి మాట్లాడారు. విజ్ఞానం, వికాసం, విత్తం అనేవి మూడు ప్రధాన అంశాలు మాత్రమే మానవాళికి, రైతుల అభివృద్దికి దోహదపడతాయని తెలిపారు. సమన్వయ సమితి సభ్యులు మిగతా రైతులందరికి ఆదర్శంగా నిలవాలని, వారిపై రైతుల గురుతర బాద్యత ఉందని అన్నారు.

ప్రధాన శాస్త్రవేత్త వెంకటయ్య చీడపీడల నివారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తనశుద్ది ఉపయోగాల గురించి తెలియజేశారు. జిల్లా వ్యవసాయాదికారి నాగేంద్రయ్య రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ అభివృద్ది పథకాలు, రైతుల సమగ్ర సర్వే గురించి చెప్పారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ విజయ్‌కుమార్‌ చెరుకు పండించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళకువల గురించి వివరించారు. కార్యక్రమంలో డాక్టర్‌ బాలాజీ నాయక్‌, ఏరువాక కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త నవీన్‌, డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండల కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *