కామారెడ్డి, ఏప్రిల్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మలేరియా వ్యాప్తి చెందకుండా తగు నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. గురువారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఎదుట మలేరియా అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మలేరియా అరికట్టడంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. జీరో మలేరియా స్టార్ట్స్ విత్‌మి అనే థీమ్‌ను ప్రారంభించారు.
డిప్యూటి డిఎం అండ్ హెచ్‌వో శోభారాణి మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో మలేరియా వ్యాధి పూర్తిగా అదుపులో ఉందని 2017లో 22 కేసులు నమోదుకాగా, 2018 లో 6 కేసులు, 2019 మార్చి వరకు 3 కేసులు మాత్రమే నమోదయ్యాయని, వీటివల్ల ఎలాంటి మరణాలు జరగలేదని తెలిపారు. వైద్యశాఖాధికారులు డాక్టర్ రాజు, రాములు, మల్లయ్య, రాజు, ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Latest posts by Nizamabad News (see all)
- ఆక్స్ఫర్డ్ పాఠశాలలో ఆధార్ నమోదు కేంద్రం - December 14, 2019
- మతపరంగా పౌరసత్వం ఇవ్వడం ప్రమాదకరం - December 14, 2019
- సహజ వనరులు పొదుపుగా వాడుకోవాలి - December 14, 2019