కామారెడ్డి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామరెడ్డి పట్టణంలో నీటిసరఫరా అదికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కుళాయిల కలుషిత నీరు సరఫరా అవుతోంది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పాత పట్టణంలో రంగుమారిన నీరు సరఫరా అవుతుంది. దీనిపై వార్డు వాసులు, అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి ఎలాంటి స్పందన లభించడం లేదని స్థానికులు వాపోతున్నారు. నీటిశుద్ది కోసం లక్షలాది రూపాయలు ఖర్చుపెడుతున్నామని మునిసిపల్ సమావేశాల్లో నీటి సరఫరా యంత్రాంగం బిల్లులు చూపెట్టి లక్షలాది రూపాయలను ఖర్చుకింద తీసుకుంటుంది. ...
Read More »Daily Archives: April 26, 2019
విద్యార్థుల జీవితాలతో చలగాటమాడడం సిగ్గుచేటు
పిడిఎస్యు కామారెడ్డి, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఇంటర్ బోర్డు తప్పుడు ఫలితాలు వెల్లడించడం వలన 22 మంది విద్యార్థులు మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందిదని, ఇంత మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కాని, ఎమ్మెల్యేలు కానీ, విద్యాశాఖ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం సిగ్గు చేటు అని పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎన్.ఆజాద్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు శుక్రవారం కామారెడ్డి ...
Read More »నామినేషన్ల స్వీకరణ
బాన్సువాడ, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. బాన్సువాడ మండలంలో బాన్సువాడ జడ్పిటిసితోపాటు మండల ప్రాదేశిక స్థానాలకు పోటీ నెలకొంటుంది. మొదటిరోజు అధికార తెరాస తరఫున జడ్పిటిసి స్థానానికి ఒక నామినేషన్ దాఖలైంది. ఎంపిటిసి స్థానాలకు 8 నామినేషన్లు రాగా, వీటిలో తెరాస-6, కాంగ్రెస్-1, స్వతంత్రులు ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు.
Read More »మొదటిరోజు మూడు నామినేషన్లు దాఖలు
రెంజల్, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కొరకు రెంజల్ మండలం నుండి శుక్రవారం మొదటిరోజు మూడు నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. మండలం నుండి జడ్పిటిసి కొరకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదన్నారు. రెంజల్ ఎంపీటీసీ-1, రెంజల్ ఎంపీటీసీ-2, సాటాపూర్ నుండి ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలైనట్లు ఎంపిడివో వెల్లడించారు.
Read More »ఘనంగా కుస్తీ పోటీలు
బాన్సువాడ, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడలో బేతాళస్వామి జాతర ఉత్సవాలు అట్టహాసంగా గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఎడ్లబండ్లతో ప్రదర్శన నిర్వహించారు. అలంకరణ, ప్రతిబ కనబరిచిన ఎడ్లబండ్లకు ప్రోత్సాహకాన్ని అందించారు. రెండోరోజు శుక్రవారం కుస్తీ పోటీలు అట్టహాసంగా జరిగాయి. స్థానిక మల్లయోధులతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు చెందిన మల్లయోధులు పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు నగదు బహుమానం అందించారు. ప్రతియేటా మూడురోజుల పాటు బేతాళ స్వామి జాతర ఘనంగా జరుగుతుంది. వివిధ జిల్లాలతో పాటు సరిహద్దులోని మహారాష్ట్ర, కర్ణాటక ...
Read More »రెండు నామినేషన్లు వేస్తే ఒకటి ఉపసంహరించుకోవాలి
జిల్లా పరిషత్ సీఈవో నిజామాబాద్, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు రెండు చోట్ల నామినేషన్ వేస్తే ఒకటి తప్పనిసరిగా ఉపసంహరించుకోవాలని జిల్లా పరిషత్ సీఈవో, అడిషనల్ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ వేణు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఒక చోటనే నామినేషన్ వేయాలని నిబంధన ఉన్నదని ఒకవేళ ఎవరైనా అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ చోట్ల నామినేషన్లు ...
Read More »పక్కాగా ఎన్నికల ఏర్పాట్లు
జిల్లా కలెక్టర్ రామ్మోహన్రావు నిజామాబాద్, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక సంస్థలకు జరగబోయే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్లో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు, ఇతర కార్యక్రమాల సంసిద్ధతపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి విడత ఎన్నికలు జరగబోయే గ్రామాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లుతో పాటు ఆయా ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్యను బట్టి ...
Read More »