Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

మొక్కల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఆగ్రో ఫారెస్టు మిషన్‌ కార్యక్రమంలో భాగంగా టేకు, వెదురు, శ్రీగంధం, సుబాబుల్‌ మొక్కల పెంపకంలో రైతులకు అవగాహన కల్పించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులకు సూచించారు. సోమవారం అటవీ, ఉద్యానవన, వ్యవసాయ వెటర్నరి శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెదురు మొక్కల పెంపకానికి సంబంధించి 60 ఎకరాలు ఉద్యానవన శాఖకు, దీనికి సంబంధించి వచ్చే జూన్‌ మాసంలో ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు.

బొప్పాస్‌పల్లి ఫాంలో 25 ఎకరాల్లో వెదురు పెంపకానికి సంబంధించి డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటుతో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సబ్సిడీపై మూడు సంవత్సరాల మెయింటెనెన్సు ఇవ్వడం జరుగుతుందని, ఎరువులు సైతం అందిస్తామని తెలిపారు. ఈ మొక్కల పెంపకానికి సంబంధించి రైతులను గుర్తించాలని, రైతుల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా అటవీశాఖాధికారి వసంత, వ్యవసాయ అధికారి నాగేంద్రయ్య, జిల్లా ఉద్యానవన శాఖాధికారి శేఖర్‌, వెటర్నరి అదికారి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *