Breaking News

భారతీయ సంస్కృతిలో నాట్యం ఎంతో గొప్పది

మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ రవీంద్రభారతిలో సోమవారం జరిగిన ”ఇషిక” కూచిపూడి రంగ ప్రవేశం కార్యక్రమంలో మాజీ స్పీకర్‌ సురేష్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇషికకి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందని ప్రశంసించారు. తను క్రీడా రంగంలో కూడా రాణించిన విషయాన్ని గుర్తు చేశారు. భారతీయ సంస్కృతిలో నాట్యం ఎంతో గొప్పదని, కళల్లో ప్రముఖ స్థానం ఉందన్నారు.

ఇషికకి చదువుతో పాటు ఇతర కార్యక్రమాల్లో కూడా ప్రోత్సహిస్తున్నందుకు వారి తల్లిదండ్రులకు, నాట్యాచార్యులకు, ముఖ్యంగా ఇషికకు హదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇలాంటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడంతో పాటు ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఇషిక కుటుంబానికి, వారి తాత రాజుకి సురేష్‌ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు.

Check Also

రైతును రాజు చేయాల‌న్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే ఖరీఫ్‌ సీసన్‌లో వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *