వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌

సాధారణ ఎన్నికల నామినేషన్‌ పరిశీలన క్రమబద్దంగా పూర్తిచేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో జడ్పిటిసి, ఎంపిటిసి సాధారణ ఎన్నికల రెండో విడత నామినేషన్‌ పరిశీలన కార్యక్రమాన్ని క్రమబద్దంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆర్డీవోలు, ఎంపిడివోలతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా నామినేషన్‌ పరిశీలనపై సమీక్షించారు. 26 నుంచి 28 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగిందని, 29న పరిశీలన, 30న అపీల్‌, మే 1న డిస్పోసల్‌, మే 2వ తేదీన విత్‌డ్రా ప్రక్రియ ఉంటుందని, ఎన్నికల నిబందనల ప్రకారం అన్ని ప్రక్రియలను క్రమబద్దంగా జరపాలని ఆదేశించారు.

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట బోర్లు వేయాలని, నీటి తొట్లలో నీరు నింపి ఉంచాలని, తాగునీటి వనరులను కాపాడాలని ఆదేశించారు. కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీవో రాజేంద్రకుమార్‌, సిపివో శ్రీనివాస్‌, ఎన్నికల లైజనింగ్‌ అదికారి సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Check Also

27న మాస్కుల‌ పంపిణీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *