Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌

తాగునీటి సమస్య ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేసవిలో తాగునీటి సమస్య ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ మిషన్‌ భగీరథ అధికారులను ఆదేశించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా భగీరథ అధికారులతో తాగునీటి సమస్యపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాగునీటికి సంబంధించి ఎలాంటి సమస్య ఉత్పన్నం కారాదని, ఒకవేళ సమస్య ఏర్పడితే రైతుల బోర్ల ద్వారా ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. జిల్లాలో 911 ఓహెచ్‌ఆర్‌ ట్యాంకులు పనిచేస్తున్నాయని, కొత్తగా 603 ట్యాంకుల నిర్మాణంలో ఉండగా 582 ట్యాంకులు పూర్తయ్యాయని, మిగతావి త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.

పైప్‌లైన్ల పనులను సైతం త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా జిల్లాలోని 827 ఆవాసాలకు తాగునీరు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. తాగునీటి సమస్యపై కంట్రోల్‌ రూంనెంబర్‌ 8468220072 లో ప్రజలు సంప్రదించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో రాజేంద్రకుమార్‌, మిషన్‌ భగీరథ అంతర్గత పన్నుల ఏ.ఇ. లక్ష్మినారాయణ, డిఇ రాకేశ్‌, అధికారులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *