Breaking News
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

చిన్న తరహా సాగునీటి వనరుల వివరాలు ఇవ్వండి

జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్నతరహ సాగునీటి వనరులకు సంబంధిత శాఖలు పూర్తి వివరాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల కంటే తక్కువ ఎకరాల సాగునీటిని అందించే ప్రాజెక్టుల వివరాలను పూర్తి సమాచారంతో అందించాలన్నారు. వీటిలో ఫాం పాండ్స్‌, డ్రిప్పులు, పర్కులేషన్‌ ట్యాంకులు, చెక్‌ డ్యాములతో పాటు చిన్న చెరువులకు సంబంధించిన ఆయా శాఖలు వివరాలను సిద్ధం చేయాలన్నారు.

ముఖ్యంగా డిఆర్‌డివో, మున్సిపల్‌ కమిషనర్‌, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్‌ తదితర శాఖలు ఇందులో ఉన్నాయన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వీటి సెన్సెస్‌ నిర్వహిస్తామని, నీటి పారుదల శాఖది ముఖ్యమైన పాత్ర అని తెలిపారు. విద్యుత్‌ శాఖ గ్రామాల వారిగా ఎన్ని వ్యవసాయ పంపుసెట్లు కనెక్షన్‌ ఉన్నాయో తెలపాలన్నారు. దీనికి గాను జిల్లా ప్రణాళిక అధికారి జిల్లా సెన్సెస్‌ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు.

కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు తగ్గుతున్నాయని ఈ దిశగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని భూగర్భ జలాలు పెంచడానికి తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై నివేదికలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో సిపివో శ్రీరాములు, డిఆర్‌ఓ అంజయ్య, డిఆర్‌డివో రమేష్‌, నీటి పారుదల శాఖ డిప్యూటీ ఈఈ నాగేశ్వరరావు, ఎస్‌ఇ దామోదర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జాన్‌ సాంసన్‌, గ్రౌండ్‌ డిడి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

రైతుకు లాభసాటి వ్యవసాయం అందించటమే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం, ప్రజల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *